ప్రిన్స్ ని మహేష్‌ అని పిలిచాడు.. గొడవలు లేనట్లే

ప్రిన్స్ ని మహేష్‌ అని పిలిచాడు.. గొడవలు లేనట్లే

ఎప్పుడు మహేష్‌ బాబు కనిపించినా కూడా, మనోడ్ని లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ అశ్వినిదత్ మాత్రం 'బాబు' లేదా 'ప్రిన్స్' అని పిలుస్తాడట. కాని మహర్షి చూసిన తరువాత బాగా ఎమోషనల్ అయిపోయిన దత్తు గారు, 'మహేష్‌.. నీ రేంజే వేరు' అనేశాడట. దానితో ఈ సినిమా ఎంత సక్సెస్ అవ్వబట్టి దత్తు గారు నన్ను మహేష్‌ అని పేరుతో పిలిచుంటారు అని చెబుతూ మహేష్‌ ఆనందపడ్డాడు. బాగానే ఉంది.

అయితే అసలు మహర్షి సినిమా రిలీజవ్వకముందు తనకు సరైన రెస్పెక్ట్ ఇవ్వట్లేదని, సినిమా ఫైనల్ కట్ విషయంలో తనని సంప్రదించట్లేదని, అలాగే తనకు కొన్ని ఏరియాల పంపిణీ కూడా ఇవ్వట్లేదని.. ఆశ్వినీ దత్ ఫీలవుతున్నట్లు అనేక రూమర్లు వచ్చేశాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు, పివిపి అండ్ దత్తు గారు కలసి కనిపించినా కూడా, నిజంగానే ఆల్ ఈజ్ వెల్ అంటారా అని చాలామంది సందేహాలు వెల్లిబూర్చారు. అయితే ఇప్పుడు దత్తుగారి మాటలు వింటుంటే, ఆయనకు కేవలం మహేష్ పైనేకాదు, దిల్ రాజు మీద కూడా చాలా ప్రేమ అండ్ రెస్పెక్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా చూస్తే ఈ సినిమా విషయంలో నిర్మాతల మధ్యన పెద్దగా గొడవలు లేవనే అనుకోవాలి.

కాకపోతే సినిమా హిట్టు అయ్యే బొమ్మలా దూసుకుపోతోంది కాబట్టి, ఈ నిర్మాతలందరూ హ్యాపీగా ఉన్నరాని.. ఒకవేళ రిజల్ట్ తేడా పడుంటే మాత్రం సీన్ వేరేలా ఉండేదని అనేవాళ్ళూ లేకపోలేదు. ఏదేమైనా కూడా వంశీ పైడిపల్లి మాత్రం మాస్ పల్స్ ను తన క్లాస్ టచ్ తో బాగానే పట్టుకుని, తన నిర్మాతల మధ్యన ఇష్యూస్ రాకుండా బాగానే డీల్ చేసినట్లున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English