తేజ ముందే చెప్పాడా? మోసం చేశాడా?

తేజ ముందే చెప్పాడా? మోసం చేశాడా?

'సీత' సినిమా వచ్చే వారం రిలీజవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దర్శకుడు తేజ ఆల్రెడీ సినిమాను ప్రమోట్ చేయడం మొదలెట్టేశాడు. ఇకపోతే త్వరలోనే బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ కాజల్ అగర్వాల్ కూడా సినిమాను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చిన హైప్ అంతా కూడా కాజల్ వలన వచ్చిందే. ఆమె నెగెటివ్ క్యారక్టర్ అలాగే కొన్ని బూతు డైలాగులు సినిమావైపు చాలామంది చూపును తిప్పేశాయి.

అయితే ఇక్కడే ఒక విషయం ఎవ్వరికీ అర్దంకావట్లేదు. కేవలం తన హీరోయిజం భారీ స్థాయిలో కనిపించడానికే సినిమాలు చేస్తున్నాడా అనిపించే బెల్లంకొండ శ్రీనివాస్ అసలు ఈ సినిమా ఎలా ఒప్పుకుని ఉంటాడు? నిజంగానే ఈ సినిమాను కాజల్ పాయింటాఫ్‌ వ్యూ లో తీస్తున్నట్లు తేజ ముందే చెప్పుంటాడా? లేదంటే హీరోకు ఒక కథను చెప్పి, చివరకు సెట్లో తేజ మరో సినిమా తీసుంటాడా? పైగా టీజర్లోనూ ట్రైలర్లోనూ కాజల్ క్యారక్టర్ తరువాత సోనూ సూద్ వేస్తున్న పంచులే బాగా పేల్తున్నాయి. బెల్లంకొండ బాబు సినిమాలో గెస్ట్ రోల్ చేసినట్లుందంతే అంటున్నారు సదరు ప్రేక్షకులు.

ఏదేమైనా కూడా నేనే రాజు నేనే మంత్రి సినిమా తరువాత తేజ తన సినిమాల్లో స్ర్టాంగ్ క్యారక్టర్లను చూపిస్తున్నాడు. అయితే ఈసారి మళ్లీ నెగెటివ్ టచ్ ఉన్న క్యారక్టర్ ను కాస్త కామవాంచ ఎక్కువగా ఉండే తన రొటీన్ విలన్స్ తరహాలో మార్చేసి.. అసలు సినిమా గురించి ఏమి ఊహించాలో అర్ధంకాని సందిగ్దంలో పడేశాడు. చూద్దాం ధియేటర్లలో ఏం చేస్తాడో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English