మహర్షి కథను కూడా క్లయిమ్ చేస్తున్నారా!!

మహర్షి కథను కూడా క్లయిమ్ చేస్తున్నారా!!

సాధారణంగా ఒక సినిమా వచ్చి హిట్టయ్యిందంటే.. దానికి దగ్గరగా వందల కథలు రాసే టాలెంట్ మన సౌత్ సినిమా ఇండస్ర్టీలో చాలానే ఉంది. అందుకే సినిమాను పోలిన సినిమాలను అనేకం చూస్తుంటాం. ఇకపోతే శ్రీమంతుడు సినిమా హిట్టయిన తరువాత, సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన హీరో అనే థీమ్ తో చాలా కథలు వచ్చేశాయి. అసలు మహేష్‌ బాబు 'మహర్షి' కూడా తన సొంత శ్రీమంతుడు అండ్ భరత్ అను నేను సినిమా నుండి ప్రేరణ పొందినట్లే ఉంది. కాని ఇప్పుడు ఈ కథ నాదంటూ ఒక దర్శకుడు రచ్చ చేస్తున్నాడని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది.

నేనొక బేసిక్ లైన్ చెబితే, దానిని కాపీ కొట్టేసి ఇప్పుడు వంశీ పైడిపల్లి అండ్ దిల్ రాజు ఈ 'మహర్షి' సినిమాను తీసేశాడని దర్శకుడు శ్రీవాస్ ఆరోపిస్తున్నాడట. దీనిపై పెద్దగా కేసులు గట్రా పెట్టట్లేదు కాని, మనోడు దిల్ రాజుతోనే వాగ్వివాదం చేశాడని చెబుతున్నారు. కాని ఇదంతా విన్న ప్రేక్షకులకు మాత్రం నవ్వొస్తోందనే చెప్పాలి. డబ్బున్న శ్రీమంతుడు ఊరిని దత్తతు తీసుకుంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్టు చూసి, అదే డబ్బున్నోడు ఊరొచ్చి వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది? అని ఒక ఐడియా వేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఇక హిట్టయిన శ్రీమంతుడు ఫ్రేమ్ వర్క్ లో మక్కికి మక్కీ సీన్లు రాసేస్తే.. మహర్షి కథ వచ్చేస్తుంది. ఈ మాత్రం కథకు మళ్ళీ కాపీ ఏంటి బాబాయ్ అని ఆడియన్స్ సెటైర్లు వేస్తున్నారంటే చూసుకోండి.

ఇకపోతే ఒక సినిమా హిట్టయ్యిందంటే చాలు, ఆ కథ నాదే అంటూ బయలుదేరే బ్యాచులు చాలానే ఉన్నాయి. అయితే కొన్నిసార్లు నిజంగానే మన దర్శకులు కథలను లేపేసిన దాఖలాలు ఉన్నప్పటికీ, మరీ ఊరందరికీ తెలిసి కథ గురించి కూడా క్లయిమ్ చేస్తుంటే మాత్రం కామెడీగానే ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English