ఇప్పుడు చూద్దాం ‘మహర్షి’ దమ్మెంతో?

ఇప్పుడు చూద్దాం ‘మహర్షి’ దమ్మెంతో?

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘మహర్షి’కి రివ్యూలు, టాక్ కొంచెం మిక్స్డ్‌గానే వచ్చాయి. ఐతే ముందు నుంచి ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలు, భారీ రిలీజ్, టికెట్ల రేట్ల పెంపు వల్ల తొలి వారాంతంలో వసూళ్లు భారీగా వచ్చాయి. దాదాపు రూ.50 కోట్ల షేర్‌తో అదరొట్టిందీ చిత్రం. ఈ ఊపు చూసి ‘మహర్షి’ బ్లాక్ బస్టర్ అనేస్తున్నారందరూ. ముఖ్యంగా చిత్ర బృందమైతే మామూలు ఉత్సాహంలో లేదు. ‘మహర్షి’ని కేవలం బ్లాక్ బస్టర్ అని కాకుండా.. ‘ఎపిక్ బ్లాక్ బస్టర్’ అంటున్నారు. క్లాసిక్‌గా పేర్కొంటున్నారు. తన గత సినిమాల వసూళ్ల రికార్డులన్నింటినీ వారం రోజుల్లో  ‘మహర్షి’ దాటేయబోతోందని ఘనంగా ప్రకటించుకున్నాడు మహేష్ బాబు. కానీ ఆరంభ దూకుడును చూసి సినిమా ఫలితం మీద ఒక అంచనా వచ్చేయడానికి వీల్లేదు.

‘మహర్షి’ థియేట్రికల్ హక్కుల్ని రూ.100 కోట్లకు అమ్మారు. ఇప్పటిదాకా వసూలైన షేర్ సగం మాత్రమే. తొలి వారాంతపు వసూళ్లే చాలా కీలకంగా మారిన ఈ రోజుల్లో ఇప్పటికే ఒక 70 శాతం రికవరీ వచ్చి ఉంటే ‘మహర్షి’ బ్రేక్ ఈవెన్‌ గ్యారెంటీ అనే నమ్మకం కలిగేది. కానీ ఇప్పటిదాకా 50 శాతమే షేర్ వచ్చింది. వీక్ డేస్‌లో అడుగుపెట్టాక ఇంకో 50 కోట్ల షేర్ అంటే మాటలు కాదు. తర్వాతి వారానికి చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినప్పటికీ ‘మహర్సి’ రూ.100 కోట్ల షేర్ వరకు వెళ్తుందా అన్న సందేహాలున్నాయి. ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరగడం వల్ల టాక్‌తో సంబంధం లేకుండా వీకెండ్లో భారీ వసూళ్లు వచ్చాయి. మరి వీక్ డేస్‌లో ఈ చిత్రం వీక్ కాకుండా ఏమాత్రం వసూళ్లు రాబడుతుందన్నది కీలకం. వీకెండ్ అయ్యాక కలెక్షన్లలో డ్రాప్ కామన్. కానీ ఆ డ్రాప్ ఏ స్థాయిలో ఉందన్నది చూడాలి. సోమవారం వసూళ్లను బట్టి ఈ చిత్రం అంతిమ ఫలితం ఏంటన్నది తేలుతుంది. చూద్దాం ఈ రోజు ‘మహర్షి’ జోరు ఎలా ఉంటుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English