రాజుగారి అడ్డాలో మహేష్ జులుం

రాజుగారి అడ్డాలో మహేష్ జులుం

ఈ గురువారం భారీ అంచనాల మధ్య వచ్చిన భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి రూపొందించిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. తొలి వారాంతంలో వసూళ్లయితే బాగానే ఉన్నాయి. ఈ సినిమా స్థాయికి ఇంకా ఎక్కువే వసూలు చేయాలి కానీ.. ఉన్నంతలో బాక్సాఫీస్ దగ్గర బెటర్‌గానే పెర్ఫామ్ చేస్తోంది.

ముఖ్యంగా తెలంగాణలో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నైజాంలో తొలి మూడు రోజుల్లో ఏ రోజుకు ఆ రోజు ‘మహర్షి’ నాన్-బాహుబలి రికార్డు నెలకొల్పడం విశేషం. తొలి రోజు ఈ చిత్రం తెలంగాణ వ్యాప్తంగా రూ.6.38 కోట్ల షేర్‌తో నాన్-బాహుబలి డే-1 రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజు రూ.3.29 కోట్లు రాబట్టిన ‘మహర్షి’.. శనివారం రెండో రోజు కన్నా ఎక్కువ రూ.3.47 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇవి రెండూ కూడా నైజాంలో నాన్-బాహుబలి రికార్డులే.

మొత్తంగా మూడు రోజుల్లో నైజాం ఏరియాలో రూ.13.14 కోట్ల షేర్‌తో ఔరా అనిపించింది ‘మహర్షి’. ఆదివారం కూడా రూ.3 కోట్లకు తక్కువ కాకుండా షేర్ వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా తొలి వారాంతంలో రూ.17 కోట్ల షేర్ మార్కుకు చేరువగా వెళ్లనుంది ‘మహర్షి’. మామూలుగా అయితే ‘మహర్షి’కి ఇంత వసూళ్లు వచ్చేవి కావు. తొలి వారాంతంలో సింగిల్ స్క్రీన్లలో టికెట్ల రేట్లు పెంచడం కలిసొచ్చింది. దీంతో కనీసం 20 శాతం వసూళ్లు ఎక్కువగా వచ్చి ఉంటాయని అంచనా.

నిర్మాత దిల్ రాజు నైజాంలో సొంతంగా రిలీజ్ చేసుకున్నాడీ చిత్రాన్ని. నైజాం ఏరియాకు ‘మహర్షి’ థియేట్రికల్ రైట్స్ వాల్యూ రూ.24 కోట్లుగా అంచనా వేశారు.ఆదాయంలో వాటాను ఆ మేరకు అంచనా వేసి హక్కులు తీసుకున్నాడు రాజు. అంటే ఇక్కడ ‘మహర్షి’ ఇంకా రూ.7 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించినట్లన్నమాట. ఫుల్ రన్లో ఆ మార్కును అందుకోవడం సాధ్యమే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English