పవన్ రీఎంట్రీపై నాగబాబు ఏమన్నాడంటే..

పవన్ రీఎంట్రీపై నాగబాబు ఏమన్నాడంటే..

ఇకపై సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని గత ఏడాది ప్రకటించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఐతే చాలామంది ఆ మాట నమ్మలేదు. ఎన్నికల తర్వాత మళ్లీ పవన్ సినిమాల్లోకి పునరాగమనం చేస్తాడనే భావించారు. మెజారిటీ అభిమానులు కూడా ఇదే ఆశిస్తున్నారు. ఎన్నికల్లో జనసేన ఎలాంటి ఫలితాలు రాబట్టినప్పటికీ.. పవన్ నిరంతరం జనాల్లో ఉండాల్సిన అవసరం ఉండదు కాబట్టి.. ఏడాదిలో కొన్ని రోజులు వీలు చూసుకుని సినిమాల్లో నటిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు జనాలు.

ఐతే పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనను తప్పుబడుతున్న వారూ లేకపోలేదు. ఐతే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ పవన్ రీఎంట్రీ ఖాయం అని వార్తలైతే గట్టిగానే వినిపిస్తున్నాయి. ఐతే తన గురించి ఎవరేం మాట్లాడుకున్నా పవన్ స్పందించడు. ఐతే పవన్ తరఫున స్పందించడానికి అతడి అన్నయ్య నాగబాబు ఉన్నాడన్న సంగతి గుర్తుంచుకోవాలి.

పవన్ పార్టీలో చేరి ఎంపీగా కూడా పోటీ చేసిన నాగబాబు తమ్ముడి గురించి ఏ రకమైన వ్యతిరేక ప్రచారం జరిగినా ఊరుకోవట్లేదు. మీడియా ద్వారా సమాధానం చెబుతున్నాడు. పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తాడన్న ప్రచారం గురించి కూడా ఆయన స్పందించారు. పవన్ సినిమాలు చేయనని గతంలో చెప్పాడని గుర్తు చేసిన నాగబాబు..  ఎన్టీఆర్, జమున, చిరంజీవి లాంటి వాళ్లు రాజకీయ ప్రవేశం తర్వాత కూడా సినిమాలు చేశారని.. పవన్ కూడా అలా చేయాలనే రూల్ లేదు కదా అని నాగబాబు అన్నాడు. నాగబాబు గుర్తు చేశారు. కల్యాణ్‌ మళ్లీ సినిమాలు చేస్తాడంటూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా కించపరుస్తున్నారని నాగబాబు అన్నాడు.

పవన్ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని, ఎవరైనా తనను డీగ్రేడ్ చేస్తే 100 రెట్లు పైకి లేస్తాడని నాగబాబు హెచ్చరించాడు. పవన్‌ను ఎవరైనా విమర్శిస్తే అది అతడికి ప్లస్ అవుతుందే తప్ప వేరొకటి కాదన్నాడు. మొత్తానికి నాగబాబు మాటల్ని బట్టి చూస్తుంటే సినిమాల్లోకి పవన్ రీఎంట్రీ ఉండదేమో అనిపిస్తోంది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏమైనా జరగొచ్చు కాబట్టి అప్పటిదాకా ఎదురు చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English