కాజల్ సాంబార్.. తమన్నా చట్నీ

కాజల్ సాంబార్.. తమన్నా చట్నీ

కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా.. దక్షిణాది సినిమాల్లో పుష్కర కాలం నుంచి చక్రం తిప్పుతున్న అగ్ర కథానాయకులు. ఇద్దరూ స్టార్ స్టేటస్ సంపాదించినప్పటి నుంచి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఐతే ఆ పోటీ ప్రొఫెషన్ వరకే. బయట ఇద్దరూ మంచి స్నేహితులు. కెరీర్ చరమాంకంలోకి వచ్చేశారు అనుకున్నాక కూడా జోరు చూపిస్తున్న ఈ ఇద్దరు భామలు ‘క్వీన్’ రీమేక్‌లో వేర్వేరుగా నటించిన సంగతి తెలిసిందే.

తమన్నా తెలుగు వెర్షన్‌లో కథానాయికగా మారితే.. కాజల్ తమిళ వెర్షన్లో లీడ్ రోల్ చేసింది. తాజాగా వీళ్లిద్దరూ కలిసి ఇటీవల చెన్నైలో ఓ ఫొటో షూట్‌లో పాల్గొనడం విశేషం. దానికి సంబంధించిన ఫొటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ షూట్ మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అందులో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

కాజల్, తమన్నా.. ఫొటో షూట్లో నిమగ్నమై ఉండగా.. ఎదురుగా ఉన్న వ్యక్తి ఈ భామల్ని చూసి... ‘మీ ఇద్దరూ కలిసి ‘గర్ల్‌ఫ్రెండ్స్‌’ పేరుతో ఓ సినిమా చేయొచ్చు కదా’ అన్నాడు. వెంటనే తమన్నా స్పందిస్తూ ‘ఇదేదో తేడాగా లేదూ?’ అంటూ నవ్వేసింది. అప్పుడు కాజల్‌ ‘విక్కీ క్రిస్టీనా బార్సిలోనా’ అనే పేరుతో హాలీవుడ్‌ సినిమా చేద్దామని చెప్పింది. అందుకు తమన్నా బదులిస్తూ.. ‘‘మరీ హాలీవుడ్‌ స్టైల్‌లో ఉన్నాయి నీ ఐడియాలు. మాస్‌ మసాలా సినిమా పేరు చెప్పు కాజల్‌’’ అని అడిగింది.

అప్పుడు కాజల్‌ ‘‘అయితే ‘సాంబార్‌ చట్నీ’ అనే సినిమా చేద్దాం. అందులో నేను సాంబార్‌... నువ్వు చట్నీ’’ అంటూ నవ్వేసింది. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఒకరితో ఒకరు పోటీ పడుతున్న హీరోయిన్లు ఇలా కలిసి ఫొటోో షూట్ చేయడం, అంత సరదాగా మాట్లాడుకోవడం విశేషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English