యంగ్‌ హీరోలకి ఆమె అందని ద్రాక్ష!

యంగ్‌ హీరోలకి ఆమె అందని ద్రాక్ష!

'గీత గోవిందం'తో యూత్‌కి హార్ట్‌త్రోబ్‌గా మారిన రష్మిక మందాన ఇపుడు అగ్ర హీరోయిన్‌గా ఎదిగే దిశలో వెళుతోంది. మహేష్‌, అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరోలు కూడా ఆమెని ఏరి కోరి తమ సినిమాలో పెట్టుకున్నారు. ఒక్కసారి ఆ చిత్రాలు విడుదలయ్యాయంటే ఇక రష్మిక టాప్‌ హీరోయిన్‌ రేసులో ముందుకి దూసుకుపోయినట్టే. ఇంకా ఆమెకి స్టార్‌ స్టేటస్‌ రాలేదు కనుక ఇప్పుడు అదృష్టం పరీక్షించుకోవాలని కొందరు యువ హీరోలు తమ చిత్రాల కోసం ఆమెని సంప్రదిస్తున్నారు. అయితే ఇప్పుడామె యువ హీరోలు, మిడిల్‌ రేంజ్‌ హీరోలకి డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు.

పారితోషికం కంటే కూడా తారాపథంలోకి వెళ్లడమే ఉత్తమమని రష్మిక భావిస్తోంది కనుక ఆమెకి భారీ మొత్తం ఎర వేసి కూడా డేట్లు రాబట్టలేకపోతున్నారు. పెద్ద చిత్రాలకి సంతకం చేసిన రష్మిక ఆ చిత్రాలకి ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్‌ ఇచ్చేలా అందుబాటులో వుండాలని అనుకుంటోంది. అందుకే చిన్న చిత్రాలని ఒప్పుకోవడం మానేసింది. ఇప్పుడు డిమాండ్‌ వుందని వచ్చిన ప్రతి సినిమా చేసేస్తే రెండేళ్లలో కనుమరుగు అయిపోవాల్సి వస్తుందనేది ఆమె ఇతర హీరోయిన్లని చూసి తెలుసుకుంది. అందుకే ఆ తప్పు చేయకుండా ఒక అయిదారేళ్ల పాటు ఇండస్ట్రీలో బిజీగా వుండేలా పావులు కదుపుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English