బాలకృష్ణని ఎదిరించే లేడీ దొరికేసింది

బాలకృష్ణని ఎదిరించే లేడీ దొరికేసింది

బాలకృష్ణ 'ఎన్టీఆర్‌' చిత్రాల పరాజయం నుంచి కోలుకుని, ఎన్నికల ప్రచారం, ఎన్నికల పర్వం ముగించుకుని మళ్లీ సినిమా చర్చలతో బిజీ అయిపోయారు. క్షణం తీరికగా వుండని బాలకృష్ణ ఇంకా బోయపాటి దగ్గర కథ రెడీ కాలేదని కె.ఎస్‌. రవికుమార్‌ సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసారు. ఈ చిత్రాన్ని బాలకృష్ణ మాస్‌ ఇమేజ్‌కి తగ్గట్టు పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నారట. ఇందులో బాలకృష్ణని ఎదిరించే ఒక పవర్‌ఫుల్‌ లేడీ విలన్‌ క్యారెక్టర్‌ వుందట. ఆ పాత్రకి తెలుగు హీరోయిన్లని కాకుండా తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ని సంప్రదించారు.

ఆమె తమిళంలో పలు చిత్రాల్లో విలన్‌ పాత్రలు పోషించి మన్ననలు అందుకోవడంతో బాలయ్యని ఎదిరించే పాత్రలోను ఆమె సత్తా చాటగలదని వరలక్ష్మికి ఆ పాత్రనిచ్చారు. తెలుగులో డైరెక్ట్‌గా నటించడం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోన్న వరలక్ష్మి ఈ అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకుంది. నరసింహాలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి క్యారెక్టర్‌ అంత పవర్‌ఫుల్‌గా ఈ పాత్ర వుంటుందని అంటున్నారు. జూన్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేసి సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్సయ్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English