చేతులు కాల్చుకోవడానికి కాజల్‌ రెడీ!

చేతులు కాల్చుకోవడానికి కాజల్‌ రెడీ!

సక్సెస్‌ అయి, భారీగా ఆర్జించిన హీరోయిన్లలో కొందరు ఆ తర్వాత కూడా సినీ రంగంలో కొనసాగాలని చూసి నిర్మాతలుగా మారారు. అలా నిర్మాతలయిన హీరోయిన్లలో సక్సెస్‌ అయిన వారెవరూ లేరు. నిర్మాతగా మారిన హీరోయిన్లకి చేదు అనుభవాలే మిగిలాయి. ఆ అనుభవాలని దృష్టిలో వుంచుకుని ఇటీవలి కాలంలో బిజీగా వున్నంతసేపు సంపాదించుకుని, ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి దూరమైపోతున్నారే తప్ప నిర్మాతలుగా అదృష్టం పరీక్షించుకుందామని ఎవరూ అనుకోవట్లేదు.

కానీ కాజల్‌ మాత్రం గతంలో హీరోయిన్లకి సినీ నిర్మాణంలో ఎలాంటి అనుభవాలున్నా కానీ తను మాత్రం చిత్ర సీమపై తనదైన ముద్ర వేయాలని భావిస్తోంది. త్వరలోనే కాజల్‌ నిర్మాతగా మారేందుకు ప్రయత్నాల్లో వుంది. కొందరు యువ దర్శకులు చెబుతోన్న కాన్సెప్ట్‌ కథలని కాజల్‌ ఆసక్తిగా వింటోంది.

తాను నటించే అవకాశముంటే ప్రధాన పాత్ర చేయడానికి, లేదా తను నటించకుండా కేవలం నిర్మాతగా వ్యవహరించడానికి కూడా ఆమె రెడీ. అయితే ఒక రెండేళ్ల తర్వాత సీరియస్‌గా ఫిలిం ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేస్తుందట. అందాక భాగస్వామ్యంలో చేయడానికి కూడా సిద్ధమేనంటోందట. మరి కాజల్‌ అయినా హీరోయిన్లకి కలిసిరాని శాఖలో విజయ పతాకం ఎగురవేస్తుందో లేదో అనేది కాలమే చెప్పాలిక.
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English