ట్యూషన్‌కి వెళుతున్న ప్రభాస్‌!

ట్యూషన్‌కి వెళుతున్న ప్రభాస్‌!

'బాహుబలి' తర్వాత తనని తాను కేవలం తెలుగు హీరోగా చూసుకోవడం లేదు ప్రభాస్‌. ఇప్పుడు తనకి దేశవ్యాప్తంగా గుర్తింపు వుండడంతో ఇకపై చేసే సినిమాలన్నీ ఇండియా వైడ్‌గా విడుదలయ్యేలానే ప్లాన్‌ చేస్తున్నాడు. అలా యూనివర్సల్‌ అప్పీల్‌ వున్న కథలని మాత్రమే ఎంచుకుంటున్నాడు. హిందీలో బాహుబలి 2 చిత్రానికి అయిదు వందల కోట్లకి పైగా నెట్‌ వసూళ్లు వచ్చాయి.

మరీ ఆ రేంజ్‌లో కాకపోయినా తన చిత్రాలకి హిందీలో ఖచ్చితంగా వంద, నూట యాభై కోట్ల బిజినెస్‌ వుండేలా చూసుకోవాలని ప్రభాస్‌ ప్రయత్నిస్తున్నాడు. అలా జరగాలంటే హిందీ ఆడియన్స్‌ తనని కేవలం బాహుబలి హీరోగా కాకుండా, తమ వాడిగానే ఓన్‌ చేసుకోవాలి. అందుకోసం ప్రభాస్‌ ఇకపై హిందీలో ఓన్‌ డబ్బింగ్‌ చెప్పుకోవాలని చూస్తున్నాడు.

నార్త్‌ మీడియాతో ఇంటరాక్ట్‌ అయ్యేప్పుడు హిందీలోనే మాట్లాడాలని డిసైడ్‌ అయ్యాడు. అయితే ప్రభాస్‌కి హిందీ అంత ఫ్లూయంట్‌గా రాదు కనుక అందుకోసం ఒక ట్యూటర్‌ని హైర్‌ చేసుకున్నాడు. హిందీ మాత్రమే కాకుండా నార్త్‌లోని పలు యాసలని కూడా ప్రభాస్‌ నేర్చుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English