మహర్షి రివ్యూలపై వంశీ పైడిపల్లి కామెంట్

మహర్షి రివ్యూలపై వంశీ పైడిపల్లి కామెంట్

సినిమా రివ్యూల విషయంలో ఫిలిం మేకర్స్ స్పందన ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. తమ చిత్రాలకు పాజిటివ్ రివ్యూలు వస్తే చాలా హ్యాపీగా ఉంటారు. లేదంటే రివ్యూలపై విమర్శలు గుప్పిస్తారు. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అనే చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తే వాటిని ట్విట్టర్లో షేర్ చేసిన హరీష్ శంకర్.. ‘దువ్వాడ జగన్నాథం’కు నెగెటివ్ రివ్యూలు వస్తే ఎలా చిటపటలాడాడో తెలిసిందే.

ఇప్పుడు వంశీ పైడిపల్లి పెద్ద కామెంట్లయితే చేయలేదు కానీ.. ‘మహర్షి’ సిినమాకు యావరేజ్ రివ్యూలు రావడం పట్ల తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. సినిమాకు వస్తున్న డివైడ్ టాక్ మీద అతను స్పందించాడు.

రివ్యూల కంటే జనాలు ఏమనుకుంటున్నారన్నది ముఖ్యమని వంశీ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడుతూ.. ‘‘ఎక్కువగా సినిమా పెద్ద‌దిగా ఉంద‌నే కంప్లైంట్ వినిపిస్తోంది. ఫ‌స్టాఫ్‌లో ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది. సెకెండాఫ్‌లో ఇంకోటి ఉంటుంది. అందుకే ఆడియెన్స్‌కు రెండు సినిమాల‌ను చూసిన ఫీలింగ్ క‌లుగుతోంది. అయితే మొద‌టి భాగం లేక‌పోతే రెండో భాగం ఉండ‌దనే విష‌యం అంద‌రూ గుర్తించాలి. సినిమాలో లేయ‌ర్స్ ఎక్కువ‌గా ఉన్నందు వ‌ల్ల నిడివి ఎక్కువైంది. ఇక‌, సినిమాకు వ‌చ్చిన రివ్యూలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ స‌గ‌టు ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌లో ఏమి ఫీల‌వుతున్నాడ‌న్న‌దే ముఖ్య‌ం’’ అని  వంశీ చెప్పాడు.

‘మహర్షి’కి డివైడట్ టాక్ రాగా.. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి. రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.32 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఫుల్ రన్లో రూ.100 కోట్ల షేర్ సాధిస్తేనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English