‘మహర్షి’ వల్ల ఎంత మేలు జరిగింది?

‘మహర్షి’ వల్ల ఎంత మేలు జరిగింది?


అల్లరి నరేష్‌ను మామూలుగా చూస్తే కమెడియన్ పాత్రలకు సరిపోతాడని అనిపిస్తుంది. కానీ అతనే హీరోగా రాణించాడు. ఎన్నో విజయాలందున్నాడు. రాజేంద్ర ప్రసాద్ స్థాయిలో తెలుగు ప్రేక్షకుల్ని నవ్వించాడు. ఒక సమయంలో మాంచి డిమాండ్ మీద ఉన్నాడు. కానీ ‘సుడిగాడు’ తర్వాత అతడి కెరీర్ తిరగబడింది. సరైన విజయాలు లేక రేసులో బాగా వెనుకబడిపోయాడు. హీరోగా కెరీర్ దారుణమైన స్థితికి చేరిన సమయంలో అతను ‘మహర్షి’లో క్యారెక్టర్ రోల్ చేయడానికి ముందుకొచ్చాడు. ఈ సినిమాలో రవిగా నరేష్ ఆకట్టుకున్నాడు. తనదైన శైలిలో నటించి మెప్పించాడు. ఐతే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించేలా కనిపించడం లేదు. ఐతే సినిమా ఫలితం ఏంటన్నది పక్కన పెడితే.. ఇది నరేష్ కెరీర్‌కు ఏ రకంగా ఉపయోగపడుతుందన్నదే ఆసక్తికరం.

‘మహర్షి’ వల్ల మళ్లీ జనాల దృష్టిలో అయితే పడ్డాడు నరేష్. హీరోగా అతడి సినిమాల్ని జనాలు పట్టించుకోవడం మానేశారు. అతను చివరగా చేసిన ‘సిల్లీ ఫెలోస్’ వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. ఇప్పుడు ‘మహర్షి’తో మళ్లీ జనాల నోళ్లలో నానుతున్నాడు. ‘మహర్షి’లో మెప్పించాడు కాబట్టి ఇక అతడికి వరుసగా క్యారెక్టర్ రోల్సే ఇస్తే చేస్తాడా? అయినా ప్రతిసారీ రవి లాంటి పాత్రలు పడటం కష్టం. నెగెటివ్ క్యారెక్టర్‌తో సక్సెస్ తర్వాత తర్వాత టిపికల్ రోల్స్ వస్తాయి కానీ.. నరేష్‌కు ఉన్న ఇమేజ్, ఇప్పుడు అతను చేసిన పాత్రను బట్టి చూస్తే అలాంటి అవకాశాలు ఎక్కువగా రావడం సాధ్యం కాదు. వచ్చిన ప్రతి క్యారెక్టర్ రోల్ చేసుకుంటూ పోతే నరేష్ ప్రత్యేకత ఏమీ ఉండదు. కెరీర్‌కు ఏమీ ప్లస్ కాదు. ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగి.. ఇంకా యంగ్ ఏజ్‌లో ఉండగానే పూర్తిగా క్యారెక్టర్ రోల్స్‌‌కు మారిపోవాలంటే కూడా ఇబ్బందే. అలాగని ‘మహర్షి’  ఇకపై నరేష్ హీరోగా నటించే సినిమాలకు ఏమాత్రం ప్లస్ అవుతుందా అన్నది కూడా సందేహమే. ముందు నరేష్ హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా ‘బంగారు బుల్లోడు’ రిలీజై దానికి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి.. మున్ముందు అతను అందుకునే అవకాశాల్ని బట్టి ‘మహర్షి’ నరేష్‌కు ఏ మేరకు మేలు చేసిందో అంచనా వేయొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English