దేవరకొండ గట్స్‌ని మెచ్చుకోవాలి

దేవరకొండ గట్స్‌ని మెచ్చుకోవాలి

విజయ్‌ దేవరకొండ సక్సెస్‌లో వైరల్‌ మార్కెటింగ్‌ది కూడా కీ రోల్‌. అర్జున్‌రెడ్డి, గీత గోవిందం చిత్రాలని కల్ట్‌ సినిమాలుగా మలచడమే కాకుండా బ్లాక్‌బస్టర్లుగా నిలబెట్టడంలో మార్కెటింగ్‌ది కీలక పాత్ర. మార్కెటింగ్‌ విషయంలో విజయ్‌ దేవరకొండ కూడా చాలా కేర్‌ తీసుకుంటూ తనవైన కాన్సెప్టులతో వస్తుంటాడు. తన సినిమాపై హైప్‌ పెంచడంలో అతను బోల్డ్‌ స్టేట్‌మెంట్స్‌ ఇవ్వడానికి కూడా వెనకాడడు. డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలోని రెండవ పాట విడుదల కానుందని మామూలుగా చెబితే పెద్దగా న్యూస్‌ అవదు. కానీ 'సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌' ఫలానా రోజున విడుదలవుతుందని విజయ్‌ ప్రకటించాడు.

మే నెలలోనే ఈ ఏడాదికే బెస్ట్‌ సాంగ్‌ వస్తోందని చెబితే ఇక దానికి క్రేజ్‌ ఎలా వుంటుంది? మిగతా హీరోల అభిమానులతో పాటు హీరోలకి కూడా కోపం వచ్చే స్టేట్‌మెంట్‌ ఇది. అయినా కానీ తన సినిమాని మార్కెటింగ్‌ చేసుకోవడం కోసం విజయ్‌ ఎలాంటి మొహమాటాలకీ తలొగ్గడు. ఎలా చెబితే ఎఫెక్ట్‌ బాగా వుంటుందో అలా చెప్పడానికే చూస్తాడు. మరి నిజంగా ఆ పాటకి అంత సీన్‌ వుందా లేదా అనేది ఆదివారం తెలుస్తుంది కానీ 'డియర్‌ కామ్రేడ్‌'కి సింగిల్‌ హ్యాండెడ్‌గా పిచ్చ క్రేజ్‌ తెచ్చి పెడుతున్నాడనడంలో మాత్రం సందేహాలు అక్కర్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English