బెల్లంకొండతో ఇంత సాహసమా?

బెల్లంకొండతో ఇంత సాహసమా?

బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఆరడుగుల రూపంతో పాటు డాన్స్‌లు, ఫైట్లు చేయగల సామర్ధ్యం అయితే వున్నాయి కానీ నటన పరంగా అతనెప్పుడూ వీకే. తొలి సినిమా నుంచి ఇంతవరకు తన బలహీనతలని కూడా అతను కవర్‌ చేసుకోలేకపోయాడు. అనుభవజ్ఞులయిన దర్శకులతో పని చేసినా కానీ డైలాగ్‌ మాడ్యులేషన్‌ కూడా మార్చుకోలేకపోయాడు. అలాంటి బెల్లంకొండ శ్రీనివాస్‌తో అమాయకుడి పాత్ర చేయించాడు తేజ. ఇది ఒక రకంగా సాహసమేనని చెప్పాలి. చాలా మామూలు నటన అవసరమయిన పాత్రల్లోనే అతను తేలిపోతూ వుంటాడు.

ఇలా కమల్‌హాసన్‌ లాంటి నటుడు చేయాల్సిన పాత్రని అతనికి ఇస్తే ఏం చేస్తాడు? సీత ట్రెయిలర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఎక్కువగా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అయినా కానీ రెండు, మూడు సీన్లు చూపించక తప్పలేదు. వాటిలో అతని నటనపై సోషల్‌ మీడియాలో చాలానే కామెంట్స్‌ పడుతున్నాయి. మరి మొత్తం సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఎలా నెట్టుకొస్తాడో? కాజల్‌, సోనూ సూద్‌ సాయంతో ఎంతవరకు నెగ్గుకొస్తాడో చూడాలి. సీత ట్రెయిలర్‌కి అయితే స్పందన బాగుంది. సినిమాపై అంచనాలని పెంచే విధంగా ట్రెయిలర్‌ కట్‌ చేయడంతో దీనిపై ట్రేడ్‌ వర్గాలలోను ఆసక్తి వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English