ఇక్కడ భయపడినా, అక్కడ భయపడలేదు

ఇక్కడ భయపడినా, అక్కడ భయపడలేదు

నిజానికి బిగ్ బాస్ ప్రోగ్రాం అంటే చాలామందికి చిరాకుగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రోగాంలో వేరే వాళ్ల పర్సనల్ లైఫ్‌ ను మనం దగ్గర నుండి చాలా కెమెరాల్లో క్లోజ్ గా చూడటం తప్పించి, వేరే ఏ విధమైన ఎంటర్టయిన్మెంట్ ఉండదు. కాకపోతే అసలు కొంతమంది సెలబ్రిటీలు రియల్ లైఫ్ లో ఇలా ఉంటారా అంటూ ఫీలైపోయి చాలామంది ఆ ప్రొగ్రాం చూడటానికి అలవాటుపడిపోయారు. అందుకే మన తెలుగులో బిగ్ బాస్ 2 కు అంత టిఆర్పీ వచ్చింది.

అయితే తెలుగులో ఈ కార్యక్రమం సీజన్ 2 హోస్ట్ చేసిన నాని, నేను బిజీగా ఉన్నాను అని చెబుతూ సైడ్ అయిపోయాడు. నిజానికి ఈ కార్యక్రమం హోస్ట్ చేయడం వలన నాని సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీ ఎదుర్కొన్నాడులే. కౌశల్ వర్సెస్ గీతా మాధురి అండ్ తనీష్‌ అంటూ జరిగిన మాటల యుద్దంలో నాని భలైపోయాడు. అందుకే మనోడు తెలివిగా ఈ కార్యక్రమం నుండి తప్పుకున్నట్లు ఎప్పుడో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ పాత్రను వేయడానికి నాగార్జున వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ 2 చేస్తున్నప్పుడు తమిళంలో కమల్ హాసన్ కూడా ఇదే తరహాలో నెగెటివిటీ ఎదుర్కొన్నాడు. మనోడు అక్కడ ఒవియా వర్సెస్ ఇతర కంటస్టంట్ల మధ్యన జరిగిన వార్ లో కమల్ నలిగిపోయాడు.

ఇక ఎలక్షన్లు రాజకీయాలు అంటూ కమల్ బిగ్ బాస్ కు దూరమవుతాడు అనుకుంటే, ఆశ్చర్యకరంగా కమల్ ఇప్పుడు నేను చేస్తున్నా అంటూ రంగంలోకి దూకేశాడట. తెలుగులో నాని భయపడినా కూడా తమిళంలో మాత్రం కమల్ వెనకడుగు వేయలేదు. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English