బాలయ్యను ఢీకొట్టబోతున్న లేడీ విలన్

బాలయ్యను ఢీకొట్టబోతున్న లేడీ విలన్

నందమూరి బాలకృష్ణ తర్వాతి సినిమా విషయంలో ఇక సందేహాలేమీ లేవు. ‘జైసింహా’ కాంబినేషన్లోనే ఆయన తన కొత్త చిత్రం చేయబోతున్నారు. సి.కళ్యాణ్ నిర్మాణంలో తమిళ సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందించే ఈ చిత్రం ఈ నెల 17న ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు సమాచారం. జూన్‌‌లోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మూడు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేసి.. ఆ తర్వాత బోయపాటి శ్రీను చిత్రాన్ని మొదలుపెట్టాలన్నది బాలయ్య ప్రణాళిక. ఇక బాలయ్య-రవికుమార్ చిత్రానికి నటీనటుల ఎంపిక కూడా దాదాపు పూర్తయింది. ‘లెజెండ్’ సినిమా తర్వాత మరోసారి బాలయ్యకు విలన్‌గా కనిపించనున్నాడు జగపతిబాబు. ఈ చిత్రంలో మరో విలన్ పాత్ర కూడా ఉందట. అది ఓ అమ్మాయి చేయబోతుండటం విశేషం. ఆ అమ్మాయి మరెవరో కాదు.. వరలక్ష్మి శరత్ కుమార్.

ముందు కథానాయికగా సినిమాలు చేసిన వరలక్ష్మికి అంతగా కలిసి రాలేదు. ఐతే ఈ మధ్య ఆమె నెగెటివ్ క్యారెక్టర్లతో చెలరేగిపోతోంది. ‘సర్కార్’ సినిమాలో విజయ్ ‌లాంటి సూపర్ స్టార్‌కు విలన్‌గా దీటైన పెర్ఫామెన్స్ ఇచ్చి ప్రశంసలందుకుంది వరు. ‘మారి-2’లోనూ ఆమె నెగెటివ్ క్యారెక్టర్‌తో మెప్పించింది. సందీప్ కిషన్ సినిమా ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’తో తెలుగులోకి కథానాయికగా ఎంట్రీ ఇస్తున్న ఆమె.. బాలయ్య సినిమాలో విలన్ పాత్రకు ఎంపికై ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయంలో రవికుమార్ పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు. ఐతే బాలయ్యకు లేడీ విలన్లతో పెద్దగా కలిసొచ్చిన దాఖలాలు లేవు. ‘పలనాటి బ్రహ్మనాయుడు’, ‘సీమసింహం’ లాంటి సినిమాల్లో లేడీ విలన్లతో ఢీకొట్టాడు బాలయ్య. కానీ ఆ సినిమా ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మరి కొత్త సినిమా అయినా ఈ సెంటిమెంటును మారుస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English