కేసీఆర్‌కు ఓట‌మి సెంటిమెంట్? అందుకే దేశంలో తొలిసారి...

కేసీఆర్‌కు ఓట‌మి సెంటిమెంట్? అందుకే దేశంలో తొలిసారి...

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఓట‌మి సెంటిమెంట్ ప‌ట్టుకుందా? క‌లిసి రాని ఎన్నిక‌ల‌ను ఎదుర్కునేందుకు ఆయ‌న కొత్త ఎత్తుగ‌డ వేశారా? ఈసీ ఇందులో భాగం పంచుకుందా? ఇవ‌న్నీ విప‌క్షాల ఆరోప‌ణ‌లు, సందేహాలు. రంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌ మ‌రియు వ‌రంగ‌ల్ జిల్లా స్థానిక సంస్థ‌ల‌కు చెందిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యం, దీనిపై అధికార పార్టీ, ఈ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ప్ర‌తిప‌క్ష పార్టీలు ఈ కామెంట్లు చేస్తున్నాయి.

ఇటీవ‌ల జ‌రిగిన గ్రాడ్యుయేట్ మ‌రియు టీచ‌ర్ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ప‌లికిన‌ అభ్య‌ర్థులు ఊహించ‌ని రీతిలో ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. అధికార పార్టీ మ‌ద్ద‌తుతో బ‌రిలో దిగిన‌ ఆ నేత‌లు కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాల నాయకుల చేతిలో ఓడిపోయారు. ఇది టీఆర్ఎస్‌కు షాక్‌ను క‌లిగింది. అయితే, తిరిగి అలాంటి ఫ‌లితం రాకుండా ఉండేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మే6వ‌ తేదీ అర్ధ‌రాత్రి ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌య్యేలా వ్యూహం ప‌న్నార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. కేసీఆర్ ఆలోచ‌న‌కు ఈసీ మ‌ద్ద‌తు ప‌లికి 6వ తేదీ అర్ధ‌రాత్రి షెడ్యూల్‌ విడుద‌ల చేశార‌ని పేర్కొంటున్నారు. షెడ్యూల్ విడుద‌ల‌తో పాటుగా ఎన్నిక విష‌యంలో విచ్చ‌ల‌విడిగా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వైఖ‌రి టీఆర్ఎస్ భ‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్ర శాస‌న‌మండ‌లి నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన నియ‌మ నిబంధ‌న‌ల‌లోని సెక్ష‌న్‌ 9.3 (iii) ప్ర‌కారం, ``మొత్తం గెలుపొందిన వారిలో క‌నీసం 10 %  లేదా ఎన్నికైన వారిలో ప‌ది మంది...ఏది త‌క్కువ అయితే అది గుర్తింపు పొందిన పార్టీ త‌ర‌ఫున ప్ర‌తిపాదించ‌బ‌డాలి`` అనే నియ‌మం ఉంది. అయితే, తాజా ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల జాబితా లేకుండానే ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల అభ్య‌ర్థి ఎలా ప్ర‌తిపాదించ‌బ‌డ‌తార‌నేది సహ‌జ‌మైన సందేహం. ఇలా జాబితా లేకుండా ఎన్నిక నిర్వ‌హించ‌బ‌డ‌టం దేశంలోనే తొలిసారి అని ప‌లువురు పేర్కొంటున్నారు. మ‌రోవైపు, ఓటు హ‌క్కు విష‌యంలోనూ చిత్ర‌మైన విధానాల‌ను అనుస‌రించారని ఆరోపిస్తున్నారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల‌కు ఓటు హ‌క్కు ఉంటుంది. అయితే, ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మే6వ తేదీన తొలి విడ‌త పోలింగ్ జ‌రిగింది. మే 10 మ‌రియు 14వ తేదీల్లో రెండో మ‌రియు మూడో విడ‌త పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఫ‌లితాలు మే 27వ తేదీన వెలువ‌డ‌తాయి. ఈ నేప‌థ్యంలో ఓట‌ర్ల జాబితా లేకుండా ఎన్నిక‌ల క‌మిష‌న్ మే 31వ తేదీన ఎన్నిక‌లు ఎలా నిర్వ‌హిస్తుందనేది మ‌రో పెద్ద అనుమానం. ఈ ప్ర‌శ్న‌లు కేవ‌లం కేవ‌లం టీఆర్ఎస్‌ పార్టీయే కాకుండా ఈసీ తీరుపై సైతం అనుమానం రేకెత్తించేలా ఉన్నాయంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English