షూటింగ్ అయిపోయాక ఇంత గ్యాప్ ఎందుకు?

షూటింగ్ అయిపోయాక ఇంత గ్యాప్ ఎందుకు?

టాలీవుడ్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. తాజాగా విజయ్ దేవరకొండ చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఈ జాబితాలో చేరింది. మే 31న రిలీజ్ అంటూ కొన్నాళ్ల కిందట ఘనంగా రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ ఆ తేదీకి సినిమా రాకపోవచ్చని ఈ మధ్య వార్తలొస్తున్నాయి. ఇప్పుడే ఆ సందేహాల్నే నిజం చేస్తూ ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు కొత్త తేదీ ప్రకటించాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రాన్ని జులై 26న విడుదల చేయనున్నట్లు అతను వెల్లడించాడు. ఈ సినిమా వాయిదా పడితే రెండు మూడు వారాలు పడొచ్చని అనుకున్నారు కానీ.. మరీ దాదాపు రెండు నెలలు వెనక్కి వెళ్లడం ఆశ్చర్యమే.

‘డియర్ కామ్రేడ్’ విడుదల ఆలస్యం అవుతుండటానికి రీషూట్లే కారణమని.. ఇంతకుముందు వార్తలొచ్చాయి. ఐతే ఆ రీషూట్లు అన్నీ అయ్యాకే ఇటీవల గుమ్మడికాయ కొట్టింది చిత్ర బృందం. రెండు వారాల కిందటే దీని షూట్ పూర్తయింది. మరి పోస్ట్ ప్రొడక్షన్ కోసం రెండు నెలలకు పైగా సమయం తీసుకోవడం ఆశ్చర్యమే. గుమ్మడికాయ కొట్టాక కూడా రషెస్ చూసుకుని మళ్లీ రిపేర్లు ఏమైనా చేస్తున్నారా అన్న డౌట్లు కొడుతున్నాయి. ఐతే చిత్ర వర్గాలు మాత్రం వేరే వెర్షన్ వినిపిస్తున్నాయి. ‘డియర్ కామ్రేడ్’ను ఒకేసారి నాలుగు భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నామని.. డబ్బింగ్ హడావుడిగా లాగించేయకుండా ప్రతి చోటా అక్కడి సినిమా అనుకునేలా క్వాలిటీ డబ్బింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని.. అన్ని చోట్లా పర్ఫెక్ట్ ఔట్ పుట్ తీసుకురావడానికే  ఇంత టైం తీసుకుంటున్నామని.. కాబట్టే హడావుడి లేకుండా ప్రశాంతంగా జులై చివరి వారంలో రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్నామని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English