ప్రియాంక-దీపిక.. కలిసి కామెడీ అయిపోయారు

ప్రియాంక-దీపిక.. కలిసి కామెడీ అయిపోయారు

అసలు బాజీరావ్ మస్తానీ సినిమా చేసినప్పటి నుండీ.. స్టార్ హీరోయిన్లు దీపిక పదుకొనె మరియు ప్రియాంక చోప్రా మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోందనే రూమర్లు చాలానే ఉన్నాయి. కాని వీరిద్దరూ మాత్రం ఎప్పటికప్పుడు కలసి ఎంట్రీలు ఇస్తూ  వాటన్నింటినీ తప్పని ప్రూవ్ చేశారు. అయితే చాలా రేర్ గా కలిసే ఈ భామలిద్దరూ ఇప్పుడు అమెరికాలో కలసి ఒక ప్రోగ్రాంలో కనిపించి ఇంకా కామెడీ అయిపోయారు తెలుసా.

ఇప్పటికే మెట్ గాలా అనే కాస్ట్యూమ్ పార్టీ ఫ్యాషన్ షో కోసం ప్రియాంక చోప్రా వేసుకొచ్చిన డ్రస్సింగ్ ట్రాలర్లకు పండగ అయిపోయింది. ఏదో పల్లెటూళ్ళలో జాతర్లకు వచ్చే వేషాల తరహాలో ఉందని ఆమెని సోషల్ మీడియాలు జనాలు ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు. అయితే అదే పార్టీకి దీపిక కూడా వచ్చిందికాని, కుందనపు బొమ్మ తరహాలో కాస్త క్యూట్ గా విచ్చేసింది. కాని ఆమె హెయిర్ స్టయిల్ కూడా దారుణమేలే.

ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు మాత్రం.. ఇద్దరూ కలసి కలసికట్టుగా ఇండియా పరువుతీశారంటూ వీళ్ళను తిట్టిపోస్తున్నారు. నిజానికి ఫ్యాషన్ సెన్స్ అంటూ ప్రియాంక ఇచ్చే లెక్చర్లన్నీ చూశాక.. ఆమె మెట్ గాలా ఈవెంట్లో ఏదో చేస్తుందని అనుకుంటే.. ఈ తరహాలో కామెడీ అయిపోవడం ఆమెకు కూడా కొత్తగానే ఉండుంటుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English