ఎఫ్‌ 2 తర్వాత వెంకటేష్‌ బేరం మారింది

ఎఫ్‌ 2 తర్వాత వెంకటేష్‌ బేరం మారింది

ఎఫ్‌ 2 చిత్రం ఘన విజయం సాధించి ఎనభై కోట్ల షేర్‌ సాధించడంతో ఏజ్‌ బార్‌ హీరోలు, యంగ్‌ హీరోలు అనే తారతమ్యం లేకుండా హిట్‌ సినిమాకి మంచి రేంజ్‌ వస్తుందనేది తేలింది. అంతకుముందు వరకు వెంకటేష్‌ని ఇరవై నుంచి ఇరవై అయిదు కోట్ల హీరోగానే చూసారు. ఎఫ్‌ 2 చిత్రం ఎనభై కోట్లు సాధించడంలో వెంకీ పాత్ర చాలా వుందనేది అందరికీ తెలుసు. అయినా కానీ ఆ చిత్రానికి వెంకటేష్‌కి మామూలుగా వచ్చే పారితోషికం మాత్రమే వచ్చింది. ఎఫ్‌ 2 తమ బ్యానర్లో చేసినట్టయితే ఆ లాభమంతా దగ్గుబాటి సోదరులకి వెళ్లేది. అందుకే వెంకటేష్‌ తీసుకునే పారితోషికాన్ని డిఫరెంట్‌గా వసూలు చేయాలని సురేష్‌బాబు డిసైడ్‌ చేసారట. ఆయనకి పారితోషికం కాకుండా లాభాల్లో వాటా ఇవ్వాలని షరతు విధిస్తున్నారట.

ఎలాగో 'వెంకీమామ' సొంత సినిమానే కనుక దానికేమీ ఫరక్‌ పడదు. కానీ ఇకపై వెంకీ సైన్‌ చేసే బయటి చిత్రాలకి మాత్రం లాభాల్లో వాటానే తప్ప ఫిక్స్‌డ్‌ రెమ్యూనరేషన్‌ తీసుకోరట. ఈ పద్ధతిలో కూడా వెంకీకి రెగ్యులర్‌గా వచ్చే పారితోషికం ఎలాగో వస్తుంది. ఒకవేళ సినిమా ఎఫ్‌2లా జాక్‌పాట్‌ కొడితే అప్పుడు వెంకటేష్‌కి కూడా అందులో వాటా దక్కుతుంది. మరి దీనికి మిగతా నిర్మాతలు అంగీకరిస్తారా లేదా అనేది వెంకీ మామ రిజల్ట్‌పై డిపెండ్‌ అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English