పవన్‌కళ్యాణ్‌ సినిమాలు చేస్తాడు... కానీ

పవన్‌కళ్యాణ్‌ సినిమాలు చేస్తాడు... కానీ

పవన్‌కళ్యాణ్‌ భవిష్యత్‌ ప్రణాళికల గురించి మీడియాలో తరచుగా ఏదో ఒక వార్త వస్తూనే వుంది. జనసేనకి గౌరవప్రదమైన ఫలితాలు రాని పక్షంలో పవన్‌ మళ్లీ సినిమాల బాట పడతాడని, ఇక రాజకీయాలకి స్వస్తి చెబుతాడని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే పవన్‌కి ఇప్పట్లో నటించే ఆలోచన అయితే లేదనేది స్పష్టం. ఫలితం ఏదైనా కానీ జనసేనని పటిష్టం చేయడంపై పవన్‌ దృష్టి పెట్టనున్నాడు. అయితే సినిమాలతో పవన్‌ పూర్తిగా దూరం కాడు. తన ఇన్‌కమ్‌ సోర్స్‌ ఇదే కాబట్టి పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌పై సినిమాలు నిర్మించడానికి పవన్‌ యోచిస్తున్నాడు. తాను నటించకుండా సినిమాలు నిర్మించే విధంగా పవన్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.

మెగా కాంపౌండ్‌లోనే పలువురు హీరోలు వుండడం, తనకి కొందరు దర్శకులతో సన్నిహిత సంబంధాలు వుండడంతో నిర్మాణంపై పవన్‌ ఫోకస్‌ పెడుతున్నాడు. కథ విని ఓకే చేయడం మినహా పవన్‌ జోక్యం చేసుకోడట. అలాగే నిర్మాత సెట్లో లేకపోతే కష్టం కనుక సోలో నిర్మాణం కాకుండా ఇతర సంస్థలతో కలిసి సినిమాలు నిర్మిస్తాడట. ఇంతకుముందు రెండు, మూడు ట్రయల్‌ అటెంప్ట్స్‌ చేసిన పవన్‌ త్వరలోనే పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ని సీరియస్‌ ప్లేయర్‌గా రంగంలోకి దించే ఆలోచన వున్నట్టు భోగట్టా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English