సాయి ధరమ్‌ తేజ్‌ వల్ల కానిది అతనికి కుదిరింది

సాయి ధరమ్‌ తేజ్‌ వల్ల కానిది అతనికి కుదిరింది

రూపు మార్చుకుని, పేరు మార్చుకుని, బిజినెస్‌ సగానికి తగ్గించుకుని ఎలాగైతేనేమి ఆరు ఫ్లాపుల పరంపరకి చిత్రలహరితో బ్రేక్‌ వేసాడు సాయి ధరమ్‌ తేజ్‌. ఇది మునిగిపోతున్న వాడికి కర్ర చేయూత దొరకడం లాంటిదే తప్ప పూర్తిగా గట్టెక్కించిన ఫలితమయితే కాదు. ఈ చిత్రం వల్ల సాయి ధరమ్‌ తేజ్‌ మలి చిత్రానికి ఓ క్రేజ్‌ వచ్చేయదు. జనం ఎగబడిపోరు. ఇదేమీ కెరియర్‌ టర్నింగ్‌ సినిమా కానే కాదు. అలాంటి సినిమా అన్వేషణలోనే వున్న సాయి ధరమ్‌ తేజ్‌కి అలాంటి కథ తారసపడడం లేదు. కానీ తన తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌కి మాత్రం మొదటి సినిమాతోనే జాక్‌పాట్‌ తగిలేసింది.

సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో విలన్‌గా నటించడానికి తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి అంగీకరించాడంటేనే ఇది స్పెషల్‌ మూవీ అనేది అర్థమవుతోంది. మైత్రి మూవీస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి 'ఉప్పెన' అనే టైటిల్‌ పరిశీలనలో వుంది. విజయ్‌ సేతుపతి నటించడం వల్ల దీనిని తమిళంలో కూడా విడుదల చేయనున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ కంటే తమ్ముడే మంచి సినిమా పట్టాడని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. తేజ్‌కి ఇలాంటి సినిమా సెట్‌ అయ్యేలోపు తమ్ముడినుంచే పోటీ ఎదురయ్యేలా వుందని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English