బెంబేలెత్తించేస్తున్న ప్రియాంక లుక్

బెంబేలెత్తించేస్తున్న ప్రియాంక లుక్

ఎప్పుడూ అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తే ఏముంది స్పెషాలిటీ అనుకుందో ఏమో.. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఒక విచిత్రమైన అవతారంలోకి మారిపోయింది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో నిర్వహించిన మెట్ గాలా వేడుకకు ప్రియాంక తయారై వచ్చిన తీరు చూసి జనాలు షాకైపోయారు. హాలోవీన్ అవతారాన్ని తలపించే లుక్‌తో ఆమె ఈ వేడుకకు హాజరైంది. ఆమె వేసుకున్న గౌన్.. ముఖానికి, జుట్టుకు వేసుకున్న మేకప్ చూసి జనాలకు ిదిమ్మదిరిగిపోయింది. ఈ వేడుకకు ప్రియాంక భర్త నిక్ జోనాస్ కూడా వచ్చాడు. అసలే అతడికి, ప్రియాంకకు జోడీ కుదరదు. ఇంకా టీనేజర్ లాగా కనిపించే నిక్ పక్కన ప్రియాంక ముదురుగా అనిపిస్తుంది. పైగా ఇప్పుడు హాలోవీన్ అవతారంలో అతడి పక్కన నిలబడే సరికి మరీ ఎబ్బెట్టుగా కనిపించింది.

ఇలాంటి లుక్స్‌లో ఆ వేడుకకు రావడం సంప్రదాయమో ఏమో కానీ.. ప్రియాంక లుక్ మాత్రం హారిబుల్‌గా ఉందన్నది వాస్తవం. ఐతే ఇదే వేడుకకు వచ్చిన మరో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే మాత్రం ఆకర్షణీయ లుక్‌తో ఆకట్టుకుంది. దీపికను చూస్తే జనాలకు బార్బీ బొమ్మ గుర్తుకు వచ్చేలా ఉంది. ఆమె హేర్ స్టైల్ డిఫరెంట్‌గానే ట్రై చేసింద ికానీ.. ప్రియాంక లాగా భయపెట్టేలా మాత్రం లేదు. దీపిక ముందు ప్రియాంక తేలిపోయిందనే విషయంలో మరో మాట లేదు. ప్రియాంక ఏ ఉద్దేశంతో ఈ లుక్ ట్రై చేసిందో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం దీని విషయంలో కామెడీ నడుస్తోంది. పాపం నిక్ అనేవాళ్లు కొందరైతే.. ఈ లుక్‌తో రాత్రి పూట ఎక్కడా తిరగొద్దంటూ ఆమెపై సెటైర్లు వేశారు ఇంకొందరు. తన లుక్ విషయంలో వచ్చిన స్పందన చూస్తే ప్రియాంక ఇంకెప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు చేయదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English