వేశ్యలకి బేరాల్లేవ్‌!

వేశ్యలకి బేరాల్లేవ్‌!

హీరోయిన్‌ వేశ్య వేషం కట్టిందంటే ఇక ఆ సినిమాకి క్రేజ్‌ వచ్చేస్తుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్టున్నారు. అందుకే ఈమధ్య హీరోయిన్లతో వేశ్య పాత్రలు వేయించే పని మీద పడ్డారు. హీరోయిన్‌ ఇలా వేశ్య వేషం వేస్తుందనగానే దానికి మీడియా కవరేజ్‌ బాగానే ఉంటుంది. ‘ఓ అవునా’ అనే ఆశ్చర్యం విన్న జనానికి కలుగుతుంది.

అయితే దాని వల్ల సదరు సినిమాకి బయ్యర్లు వచ్చేస్తారనుకోవడం భ్రమేనని తేలిపోయింది. ఎందుకంటే వేశ్యలుగా ఛార్మి, శ్రియ నటించిన రెండు చిత్రాలు బిజినెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ‘ప్రేమ ఒక మైకం’, ‘పవిత్ర’ చిత్రాల రిలీజ్‌ డేట్లు మారాయి. ఇంకా మారుతూనే ఉన్నాయి. ఈ ఇద్దరు హీరోయిన్లకీ మార్కెట్‌ లేకపోవడంతో ఇప్పుడీ సినిమాలు కొనడానికి ఎవరూ ముందుకి రావడం లేదు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు