తమన్నా సినిమా అది చూడాలా.. ఇది చూడాలా?

తమన్నా సినిమా అది చూడాలా.. ఇది చూడాలా?

ప్రభుదేవా, తమన్నా జంటగా ఆల్రెడీ 'అభినేత్రి' అనే హార్రర్ కామెడీ మూవీ వచ్చింది. అది అంతగా ఆడకపోయినా పట్టించుకోకుండా సీక్వెల్ తీశారు. మే 1నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ 'ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్' దెబ్బకు దాన్ని వాయిదా వేసేశారు. కుదిరితే నెలాఖర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ దాని సంగతి తేలకుండానే తమన్నా, ప్రభుదేవా జంటగా నటించిన మరో హార్రర్ మూవీ రిలీజ్‌కు రెడీ అయిపోవడం విశేషం.

అదే.. కామోషి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. తమన్నా, ప్రభుదేవా ఇంటెన్స్ లుక్స్‌లో కనిపిస్తున్నారు ఈ పోస్టర్లో. ఈ చిత్రంలో కామెడీకి ఛాన్స్ లేనట్లుంది. ఇది పూర్తి స్థాయి హార్ర్ మూవీలా కనిపిస్తోంది. కానీ ఆల్రెడీ తమన్నా, ప్రభుదేవాలను ఒక హార్రర్ కామెడీ మూవీలో చూశాం. దానికి కొనసాగింపుగా ఇంకో సినిమా రెడీ అయింది. అది రిలీజవుతున్న సమయంలోనే ఇదే జోడీని ఇంకో హార్రర్ మూవీలో చూడటం అంటే జనాలకు విసుగొచ్చేయడం ఖాయం.

'సాగర సంగమం' సినిమాలో బాలనటుడిగా మంచి కాామెడీ క్యారెక్టర్ చేసి.. పెద్దయ్యాక దర్శకత్వ శాఖలో పని చేసిన కమల్ హాసన్ చిత్రం 'ఈనాడు'తో దర్శకుడిగా మారిన చక్రి తోలేటి డైరెక్ట్ చేసిన చిత్రం 'కామోషి'. 'ఈనాడు' ఫ్లాప్ అయినప్పటికీ.. అతను దర్శకుడిగా ప్రయత్నాలు కొనసాగించాడు. కానీ ప్రతిసారీ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. అజిత్‌తో తీసిన 'డేవిడ్ బిల్లా' కూడా డిజాస్టర్ అయింది. నయనతార కథానాయికగా ఓ హార్రర్ మూవీ తీస్తే అది వివాదాల్లో చిక్కుకుని విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. ఆ సినిమా పక్కకు వెళ్లిపోయిన సమయంలోనే తమన్నా, ప్రభుదేవాలతో 'కామోషి' మొదలుపెట్టాడు. ఎలాగోలా పూర్తి చేశాడు.

ఈ చిత్రాన్ని, తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నారు. కానీ తమన్నా, ప్రభుదేవా ఆల్రెడీ రెండు హార్రర్ కామెడీ మూవీల్లో నటించడం, దర్శకుడిగా చక్రి రికార్డు బ్యాడ్‌గా ఉండటం, ఇంకా కొన్ని కారణాల వల్ల 'కామోషి'కి క్రేజ్ ఏమీ కనిపించడం లేదు. మరి ఈ సినిమాతో చక్రి అండ్ టీం ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English