అఖిల్‌ అక్కడుంటే నాగార్జునకి కుదురు లేదు!

 అఖిల్‌ అక్కడుంటే నాగార్జునకి కుదురు లేదు!

చిన్న కొడుకు అఖిల్‌ ఇంతవరకు విజయం సాధించలేకపోవడం నాగార్జునని తీవ్రంగా కలచి వేస్తోంది. నాగచైతన్య మజిలీతో కెరియర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ సాధించినా కానీ నాగార్జున ఆ విజయాన్ని అంతగా ఆస్వాదించకపోవడానికి అఖిల్‌ కెరియరే కారణమట. వరుసగా మూడు పరాజయాలు చవిచూసిన అఖిల్‌ ఇప్పుడు గీతా ఆర్ట్స్‌ కాంపౌండ్‌లోకి వెళ్లాడు. గీతా వారి రీసెంట్‌ ట్రాక్‌ రికార్డ్‌ని బట్టి నాగార్జున మనసు కుదుట పడి వుండాలి. నాగచైతన్యకి కూడా 100% లవ్‌తో మంచి హిట్‌ ఇచ్చిన బ్యానర్‌ అది.

అయినప్పటికీ అఖిల్‌ సినిమా విషయంలో మాత్రం నాగార్జున కుదుట పడడం లేదట. కారణం ఇంతవరకు అఖిల్‌కి ఏ సెక్షన్‌లోను నమ్మకమైన ఆడియన్స్‌ ఏర్పడకపోవడం ఒకటి కాగా, మరొకటి ఈ చిత్రానికి దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ కావడమట. అతను హిట్‌ ఇచ్చి చాలా కాలమవుతోన్న నేపథ్యంలో నాగార్జునకి ఈ చిత్రంపై కాస్త గుబులుగానే వుందట. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్‌ గురించి ఫోన్‌లో చర్చిస్తున్నాడట. 100% లవ్‌కి సుకుమార్‌ దర్శకుడు కావడంతో అప్పుడు ఎలాంటి చింత లేకపోయినా ఈసారి బొమ్మరిల్లు భాస్కర్‌ ట్రాక్‌ రికార్డ్‌ నాగ్‌ని కలవర పెడుతోందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English