క్రిష్‌ ఈగో హర్టయింది

క్రిష్‌ ఈగో హర్టయింది

ఎన్టీఆర్‌ రెండు భాగాల పరాజయంతో పాటు మణికర్ణిక దర్శకత్వ క్రెడిట్‌ తననుంచి కంగన రనౌత్‌ తస్కరించడంతో బాగా డీలా పడిన క్రిష్‌ దానినుంచి తేరుకున్నాడు. ఇటీవలే జెర్సీ దర్శకుడు, కథానాయకుడిని ప్రశంసిస్తూ గౌరవపూర్వకంగా ఒక ఇంటర్వ్యూ కూడా చేసాడు. అయితే ఇంకా తన తదుపరి చిత్రంపై క్రిష్‌ నిర్ణయానికి రాలేదు.

తెలుగులో తీయడం కంటే హిందీలోనే ఒక అగ్ర నటుడితో సినిమా చేయాలనే ప్లాన్‌లో వున్నాడని మాత్రం చెబుతున్నారు. మణికర్ణికకి క్రిష్‌ చేసింది ఏమీ లేదని అనడమే కాకుండా, అతను సినిమా తీస్తే ఎలా వుంటుందో 'ఎన్టీఆర్‌: మహానాయకుడు' చూస్తేనే తెలుస్తోందిగా అని కంగన అతడిని అవమానించింది.

అందుకే తెలుగులో సినిమా తీసి విజయవంతమయినా దానికి బాలీవుడ్‌లో కవరేజ్‌ రాదు కనుక, హిందీలోనే ఒక భారీ చిత్రం తీసి తన సత్తా చాటుకుని, ఆ తర్వాత మణికర్ణిక చిత్రాన్ని తననుంచి కంగన ఎలా తస్కరించింది అనేది మాట్లాడితే వెయిట్‌ వుంటుందని క్రిష్‌ హిందీ చిత్రాన్నే ప్లాన్‌ చేస్తున్నాడట. ఇదంతా చూస్తోంటే ఈ వ్యవహారాన్ని క్రిష్‌ చాలా పర్సనల్‌గానే తీసుకున్నట్టున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English