హాట్‌: తేజస్వి మదివాడ టాప్‌లెస్‌ పోజ్‌!

హాట్‌: తేజస్వి మదివాడ టాప్‌లెస్‌ పోజ్‌!

హీరోయిన్‌గా చిన్న సినిమాల్లో నటించి, పెద్ద సినిమాల్లో సహాయక పాత్రలు చేసి, ఇటీవల బిగ్‌బాస్‌తో కాంట్రవర్షియల్‌ పర్సన్‌గా పేరు తెచ్చుకున్న తేజస్వి మదివాడకి ఆ తర్వాత కెరియర్‌ పరంగా చెప్పుకోతగ్గ పరిణితి లేదు. గట్టిగా మాట్లాడితే ఆమె కెరియర్‌ మేకు కొట్టినట్టుగా అక్కడే ఆగిపోయింది. బిగ్‌బాస్‌ పాపులారిటీతో బిజీ అవుతుందని భావించింది కానీ ఆ షో వల్ల వచ్చిన నెగెటివిటీ వల్ల తేజస్విని బుల్లితెర కార్యక్రమాలకి కూడా ఆహ్వానించడం లేదు.

ఇదిలావుంటే తేజస్వి ఈ టైమ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ పెంచుకోవడం కోసం ఉపయోగించుకుంటోంది. అదే పనిగా హాట్‌ ఫోటోలు పోస్ట్‌ చేస్తోన్న తేజస్వి ఇప్పుడో అడుగు ముందుకేసి టాప్‌లెస్‌ ఫోటో పెట్టింది. అయితే ఆ ఫోటోలో ఆమె వెనక్కి తిరిగి పోజిచ్చింది. ఎక్సర్‌సైజ్‌ల ద్వారా వీపు షేపు మారిపోయిందని ఆమె చెప్పుకుంటోంది. ఆ సాకు చూపించి ఈ ఫోటో పోస్ట్‌ చేసింది. మరి మున్ముందు తేజస్వి ఇంకెంత హాట్‌గా కనిపించనుందనేది లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English