ఎన్టీఆర్‌ - చరణ్‌ ఫిజికల్లీ ఫిట్‌యేనా?

ఎన్టీఆర్‌ - చరణ్‌ ఫిజికల్లీ ఫిట్‌యేనా?

ఎంత ఫిట్‌గా వున్న వారికి అయినా కొన్ని సినిమాలు చేస్తున్నపుడు కాస్త ఎక్స్‌ట్రా డోస్‌ ఆఫ్‌ ఫిట్‌నెస్‌ అవసరం అవుతుంది. ఉదాహరణకి బాహుబలి లాంటి చిత్రానికి ఉన్నపళంగా షూటింగ్‌కి వెళ్లిపోతే హీరో, విలన్‌ వల్ల అవదు. అందుకని ప్రభాస్‌, రానా ఇద్దరూ కూడా ఫిజికల్‌గా కఠోర శ్రమ పడి, ఆ చిత్రానికి యుద్ధ సన్నద్ధులై షూటింగ్‌కి వెళ్లారు. రాజమౌళి సినిమాలకి దేనికైనా అలాంటి ఫిజికల్‌ శ్రమ తప్పదు. అయితే 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' విషయంలో హీరోల ఫిట్‌నెస్‌పై రాజమౌళి అంతగా కేర్‌ తీసుకోలేదు.

వాళ్లకంటూ ఎలాంటి గోల్స్‌ పెట్టకుండా సరాసరి షూటింగ్‌కి తీసుకెళ్లిపోయాడు. ఊహించినట్టుగానే ఇద్దరు హీరోలు గాయపడ్డారు. దాంతో షూటింగ్‌కి హాజరు కాలేకపోతున్నారు. చరణ్‌ కాలికి, ఎన్టీఆర్‌ చేతికి గాయాలయ్యాయి. ఎన్టీఆర్‌ అయినా కాస్త శారీరిక ధారుఢ్యం పెంచుకున్నాడు కానీ చరణ్‌ అయితే సరాసరి వినయ విధేయ రామ నుంచి ఈ చిత్రం సెట్స్‌లో జాయిన్‌ అయిపోయాడు. ఎన్టీఆర్‌ ఇంకా చేతికి కట్టు కట్టుకుని తిరుగుతోంటే, చరణ్‌ ఏమో సరిగా నడవలేకపోతున్నాడు. వీరిద్దరూ కోలుకున్నాక అయినా ఫిట్‌నెస్‌ కోసమని రాజమౌళి టైమ్‌ ఇస్తాడో లేక షూటింగ్‌ లేట్‌ అవుతోందని మళ్లీ ఇలాగే రిస్క్‌ చేయిస్తాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English