బాలకృష్ణ రుణం తీర్చేసుకుంటున్నాడు

బాలకృష్ణ రుణం తీర్చేసుకుంటున్నాడు

లెజెండ్‌ సినిమాతో ఎవరికి ఎంత లాభం జరిగిందనేది తెలియదు కానీ జగపతిబాబుకి మాత్రం ఆ చిత్రం సుడి తిరిగిపోయింది. ఏ ముహూర్తాన తెల్ల జుట్టు, తెల్ల గడ్డంతో కనిపించడానికి, విలన్‌ పాత్ర పోషించడానికి అంగీకరించాడో కానీ అప్పుడే జగపతిబాబు టైమ్‌ మొదలయింది. దక్షిణాదిలో బిజీ విలన్‌గా అన్ని భాషల్లోను వరుసగా సినిమాలు చేసేస్తోన్న జగపతిబాబుకి ప్రతి సినిమాకీ మూడు కోట్లు చెల్లించుకోవాలట. లేదంటే రోజుల లెక్కన రోజుకి పదిలక్షలు ఇవ్వాలట. హీరోగా తెరమరుగు అయిపోతున్న దశలో జగపతిబాబుకి లెజెండ్‌తో అదృష్టం వరించింది. ఇక అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. అయితే మళ్లీ బాలయ్యతో కలిసి జగపతిబాబు నటించలేదు.

ఇన్నాళ్లకి బాలకృష్ణతో నటించే అవకాశం రాగా, జగపతిబాబు మారు మాట్లాడకుండా ఓకే చెప్పేసాడు. కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించే చిత్రంలో జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పుడున్న బిజీలో వెంటనే డేట్స్‌ ఇచ్చే పరిస్థితి లేకపోయినా కానీ బాలయ్యపై అభిమానంతో జగపతిబాబు మిగిలిన సినిమాల షెడ్యూల్స్‌ అడ్జస్ట్‌ చేసుకుని మరీ ఈ చిత్రానికి డేట్స్‌ ఇచ్చాడు. ఈ ఇద్దరి రోరింగ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రాన్ని కూడా లెజెండ్‌లా మాస్‌ హిట్‌గా నిలబెడుతుందా లేదా అనేది వేచి చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English