వెబ్‌సైట్‌కి గట్టిగా గడ్డి పెట్టిన గబ్బర్‌సింగ్‌!

వెబ్‌సైట్‌కి గట్టిగా గడ్డి పెట్టిన గబ్బర్‌సింగ్‌!

సినిమా వాళ్లు ఏమి చేసినా కానీ దానికి నాణ్యతా సర్టిఫికెట్‌ ఇచ్చి తీరాల్సిందే అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి కొన్ని మీడియా వర్గాలు. ఆఖరుకి ఒక ఉత్తమ లక్ష్యంతో, పేద దర్శకుల బాగోగుల కోసమని సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడానికై దర్శకులంతా కలిసి వచ్చి చేసిన ఈవెంట్‌పై కూడా నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చి దర్శకుల మనసులని బాధ పెట్టారు. ఈ కార్యక్రమంలో కొందరు దర్శకులు చేసిన స్కిట్లని తప్పుబడుతూ, జబర్దస్త్‌ వాళ్లే నయమన్నట్టుగా వాళ్లని కించపరుస్తూ ఒక వెబ్‌సైట్‌లో ఆర్టికల్‌ పెట్టారు. అది చూసి గబ్బర్‌సింగ్‌ దర్శకుడు హరీష్‌ శంకర్‌ తన శాంతం కోల్పోకుండానే గట్టిగా గడ్డి పెట్టాడు.

తాము కెమెరాల వెనుక బాగా చేయగలమనేది తమకి కూడా తెలుసునని, కానీ ఒక ఉదాత్తమైన కారణంతో చేసిన కార్యక్రమానికి కూడా రివ్యూలు రాయాల్సిన అవసరం లేదని సదరు వెబ్‌సైట్‌కి  గట్టిగానే హితవు చెప్పాడు. ఆ ఆర్టికల్‌ పబ్లిష్‌ అవగానే పబ్లిక్కే సదరు వెబ్‌సైట్‌కి ట్విట్టర్‌లో అక్షింతలు వేసారు. తర్వాత హరీష్‌ శంకర్‌ కూడా తగులుకునే సరికి ఇంకాస్త రెచ్చిపోయి మరీ గడ్డి పెట్టారు. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే... నిన్న మొన్నే పుట్టుకొచ్చిన ఆ వెబ్‌సైట్‌ మిగిలిన వెబ్‌సైట్లకి నీతులు చెబుతూ ఉత్తమ పురుష్‌ స్టేట్‌మెంట్లు ఇస్తూ వుంటుంది. కానీ అనవసర విషయాలని కూడా తప్పుబడుతూ లేదా కొందరికి పక్షపాతంగా వ్యవహరిస్తూ అడపాదడపా ఇలా అక్షింతలు మాత్రం వేయించుకుంటూనే వుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English