మహర్షి దర్శకుడికి అస్సలు కంట్రోల్‌ లేదు

మహర్షి దర్శకుడికి అస్సలు కంట్రోల్‌ లేదు

మహర్షి రిజల్ట్‌ ఏమవుతుందో, నిజంగానే బ్లాక్‌బస్టర్‌ అయి రికార్డులు కొల్లగొడుతుందో లేదో అన్నది పక్కన పెడితే ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లికి మాత్రం రిజల్టుతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ఒక చెడ్డ పేరు అయితే వచ్చింది. దిల్‌ రాజు యమా ఊపులో దూసుకుపోతున్న రోజుల్లో అతనికి మున్నాతో ఫ్లాప్‌ ఇచ్చాడు వంశీ పైడిపల్లి. ప్రభాస్‌ మార్కెట్‌కి మించి ఖర్చు పెట్టిన ఆ చిత్రం అప్పట్లో పెద్ద ఫ్లాపయింది. ఊపిరి చిత్రంతో బాగా  మెప్పించినా కానీ ఆ చిత్రం కాస్ట్‌ ఫెయిల్యూర్‌ అయింది. ఆ చిత్రానికి నష్టాలు రావడం వల్లే ఆ చిత్ర నిర్మాత పివిపిని కూడా 'మహర్షి'లో భాగస్వామిగా చేసుకోవాల్సి వచ్చింది. ఊపిరిలాంటి చిత్రానికి కూడా నష్టాలు వచ్చాయంటే ఆ దర్శకుడు ఎంతగా ఖర్చు పెట్టించాడనేది అర్థమవుతోంది.

ఇక మహర్షికి కూడా అంచనాలకి మించి ఖర్చు పెట్టించాడట. ఈ చిత్రానికి అన్నీ కలుపుకుని దాదాపు నూట నలభై కోట్ల బిజినెస్‌ జరిగినా కానీ నిర్మాతలకి లాభాలే రాలేదట. సినిమా విడుదలయి బయ్యర్ల డబ్బులు తిరిగి వచ్చి, వారికి లాభాలు వస్తేనే నిర్మాతలకి కూడా చేతిలో ఏమైనా మిగులుతాయట. ఇంతగా ఖర్చు పెట్టించిన వంశీ పైడిపల్లికి బడ్జెట్‌ కంట్రోల్‌ తెలియకపోతే ఎన్ని ఉత్తమ చిత్రాలు తీసినా లాభం లేదనేది ట్రేడ్‌ మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English