ముగ్గుర్ని స్టార్స్‌ని చేసిన సినిమా అది!

ముగ్గుర్ని స్టార్స్‌ని చేసిన సినిమా అది!

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ సీక్వెల్‌ త్వరలో విడుదలకి సిద్ధమవుతోంది. కరణ్‌ జోహార్‌ అన్ని సినిమాలలానే దీనికి కూడా మంచి ఆడియో సమకూరింది. ఇంతవరకు విడుదల చేసిన రెండు పాటలు కూడా హిట్టయ్యాయి. ఈ చిత్రంలో హీరోగా టైగర్‌ ష్రాఫ్‌ నటిస్తున్నాడు. కథానాయికలుగా మాత్రం అనన్య పాండే, తారా సుతారియా పరిచయం అవుతున్నారు.

టైగర్‌ ష్రాఫ్‌ని ఈ చిత్రం పెద్ద స్టార్‌ని చేస్తుందా? తారా, అనన్య ఇద్దర్నీ తారాపథంలో నిలబెడుతుందా? స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అయితే మామూలు సినిమా కాదు. ఆ చిత్రంతో పరిచయం అయిన వారందరూ స్టార్లుగా ఎదిగారు. వరుణ్‌ ధవన్‌, ఆలియా భట్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోయారు.

ఈసారి సీక్వెల్‌కి కొత్త నటుడిని కాకుండా ఆల్రెడీ యూత్‌లో క్రేజ్‌ వున్న టైగర్‌ని కథానాయకుడిగా ఎంచుకోవడంతో ఇన్‌స్టంట్‌ క్రేజ్‌ రాబట్టారు. ఇక తారా, అనన్య అయితే ఆలియా మాదిరిగా స్టార్స్‌ అయిపోతామని కలలు కంటున్నారు. అయితే ఈ సీక్వెల్‌ని కరణ్‌ జోహార్‌ డైరెక్ట్‌ చేయలేదు. కానీ నిర్మాతగా వెనక వుండి నడిపించాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English