నాగశౌర్య జేబులోంచి పెట్టక తప్పట్లేదు

నాగశౌర్య జేబులోంచి పెట్టక తప్పట్లేదు

హీరోగా కెరియర్‌ ఎటూ కాకుండా పోతోన్న తరుణంలో తన దగ్గరకి వచ్చిన కథని నమ్మి స్వీయ నిర్మాణంలో ఛలో చేసాడు నాగశౌర్య. అయితే ఆ చిత్రం పెంచిన ఆత్మవిశ్వాసం శృతి మించి వెంటనే 'నర్తనశాల' చేసి దెబ్బ తిన్నాడు. ఛలో ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో పాటు లాభాలని కూడా నర్తనశాల హరించేయడంతో నాగశౌర్య స్లో అయిపోయాడు. ఆ సినిమా తర్వాత కూడా తనకి కొన్ని అవకాశాలయితే వస్తున్నాయి కానీ తన కెరియర్‌ని ముందుకి నడిపించే చిత్రాలు మాత్రం తారస పడడం లేదు.

ఆమధ్య ఒక సినిమా మొదలయి కూడా ఆగిపోవడంతో నాగశౌర్య మరోసారి తన జేబులోకే చేతులు పెట్టక తప్పట్లేదు. త్వరలో సొంత బ్యానర్లో నాగశౌర్య మరో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి కూడా ఒక దర్శకుడే దర్శకత్వం వహిస్తాడు. అయితే నర్తనశాల అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని ఈసారి ఈ చిత్ర నిర్మాణ పరంగా నాగశౌర్య పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇండస్ట్రీలో పలువురు సీనియర్‌ దర్శకులు, రచయితలకి కథ వినిపించి వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నాడు. నటుడిగానే కాకుండా తన ఆర్థిక పరమైన స్థిరత్వానికి కూడా ఈ చిత్రం కీలకమవుతుంది కనుక నాగశౌర్య ఎలాంటి ఛాన్స్‌లు తీసుకోవడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English