ఆ ఛాన్స్ ఒక్క జ‌క్క‌న్న‌కే ఇస్తాడ‌ట‌!

ఆ ఛాన్స్ ఒక్క జ‌క్క‌న్న‌కే ఇస్తాడ‌ట‌!

మీడియాతో అరుదుగా మాట్లాడే స్టార్ హీరోల్లో మ‌హేశ్ బాబు ముందుంటారు. ఏడాదికి ఒక సినిమా..కొన్ని సంద‌ర్భాల్లో ఏడాదిన్న‌ర‌కు ఒక సినిమా చేసే అల‌వాటున్న ఆయ‌న‌.. సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు త‌ప్పించి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌టం.. మీడియా వారితో మాట్లాడ‌టం లాంటివి చేయ‌రు. ఏదైనా వాణిజ్య కార్య‌క్ర‌మానికి హాజ‌రైనా.. తాను వ‌చ్చిన ప‌ని త‌ప్పించి.. మ‌రింకే విష‌యాల మీద ఫోక‌స్ పెట్ట‌రు.

ఒక‌వేళ‌.. ఎవ‌రైనా మాట్లాడ‌మ‌న్నా.. ఇప్పుడు స‌మ‌యం కాదంటూ మాట మారుస్తారే కానీ.. మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ఈ కార‌ణంతోనే మ‌హేశ్ కు సంబంధించిన ఇంట‌ర్వ్యూలు చాలా త‌క్కువ‌గా ప‌బ్లిష్ అవుతుంటాయి. విడి రోజుల్లో అంటీముట్ట‌న‌ట్లుగా ఉండే మ‌హేశ్‌.. త‌న సినిమా విడుద‌ల‌వుతున్న వేళ‌లో మాత్రం.. మీడియాకు ఫుల్ యాక్సిస్ ఇచ్చేస్తుంటారు. ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు తీసుకోవ‌చ్చంటూ ప్రొడ‌క్ష‌న్ హౌస్ చేత ప్ర‌త్యేక స‌మాచారాన్ని పంపుతుంటారు. తాజాగా ఆయ‌న న‌టించిన మ‌హ‌ర్షి మూవీ రిలీజ్ కానుంది.

ఇక‌.. ఆయ‌న మీడియాలో వీలైనంత ఎక్కువ క‌నిపించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. దీనికి త‌గ్గ‌ట్లే మీడియా కూడా ఆయ‌న‌కు అంతే ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటుంది. తాజాగా చూస్తే.. అన్ని మీడియా సంస్థ‌లు మ‌హేశ్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల‌తో పేజీల్ని నింపేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చారిత్ర‌క పాత్ర‌ల్లో మిమ్మ‌ల్ని చూడాల‌ని అభిమానుల మాట‌.. మ‌రి మీరేమంటార‌న్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాన్ని ఇచ్చారు మ‌హేశ్‌.

త‌న‌కు చారిత్ర‌క పాత్ర‌లంటే భ‌య‌మ‌ని.. ఒక‌వేళ రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కులు కానీ ముందుకొచ్చి త‌న‌ను ఒప్పిస్తే మాత్రం ఒప్పుకుంటాన‌ని.. అప్పుడుఅలాంటి పాత్ర‌లు చేస్తాన‌ని చెప్పారు. రాజ‌మౌళికి తీరి.. మ‌హేశ్ వ‌ద్ద‌కు వ‌చ్చి.. బాబు.. మీరు చారిత్ర‌క పాత్ర‌లు చేయ‌మ‌ని అడుగుతారంటారా?

ఈ విష‌యం ఇలా ఉంటే.. కొత్త ద‌ర్శ‌కులు త‌న‌తో చేయ‌టానికి వ‌స్తున్నారుకానీ తానింకా క‌థ‌లు విన‌లేద‌న్నారు. కొత్త వాళ్ల‌నుప్రోత్స‌హించ‌న‌ని చెప్ప‌టం త‌ప్పు అని.. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా జూన్ చివ‌ర్లో విడుద‌ల కానున్న విష‌యాన్ని చెప్పారు. అయినా.. వంశీ పైడిప‌ల్లి లాంటి ద‌ర్శ‌కులు క‌థ చెప్పేందుకు వ‌స్తేనే.. 20 నిమిషాల్లో పంపిద్దామ‌ని డిసైడ్ అయిన మ‌హేశ్‌.. కొత్తోళ్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌టం సాధ్యమేనంటారా? 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English