16 గంట‌ల ఫ్లైట్ జ‌ర్నీతో మ‌హేశ్ వారిని మ‌రిచార‌ట‌!

16 గంట‌ల ఫ్లైట్ జ‌ర్నీతో మ‌హేశ్ వారిని మ‌రిచార‌ట‌!

రంగం ఏదైనా కానీ.. ప్ర‌ముఖులు మాట్లాడే మాట‌ల మీద ఫోక‌స్ పెరిగింది. వారేం చెబుతున్నారు?  వారేం మాట్లాడుతున్నార‌న్న విష‌యాల్ని చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించే త‌త్త్వం ఇప్పుడు పెరుగుతోంది. ఇలాంటి ప‌రిస్థితి ప్ర‌ముఖుల‌కు క‌త్తి మీద సాము లాంటిది. గ‌తంలో ఏదైనా మాట్లాడేసి.. ఆ మాట‌లు వివాదంగా మారితే.. తాను చెప్ప‌ని మాట‌ల్ని మీడియా రాసింద‌నో.. తాను చెప్పిన మాట‌లు మీడియాలో క‌ట్ అయ్యాయ‌న్న ఎక్స్ క్యూజ్ ఉండేది.

ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు. ప్రొఫెష‌న‌ల్ కెమెరాలే కాదు.. ప్ర‌తిఒక్క‌రి ఫోన్లోనూ ప‌ర్స‌న‌ల్ కెమెరాలు మ‌స్తుగా ఉన్న ప‌రిస్థితి. ప్ర‌ముఖులు బ‌య‌ట క‌నిపించినా.. వారు మాట్లాడినా.. ఆఖ‌రికి తుమ్మినా.. ద‌గ్గినా రికార్డు చేయ‌టం కొంద‌రికి అల‌వాటుగా మారింది. ఈ నేప‌థ్యంలో మ‌ట్లాడే ప్ర‌తి మాట‌నుఆచితూచి అన్న‌ట్లుగా మాట్లాడాలి. తాజాగా ఇలా చేసిన ఒక త‌ప్పున‌కు వివ‌ర‌ణ ఇవ్వాల్సిన ప‌రిస్థితి టాలీవుడ్ సూప‌ర్ క‌థానాయ‌కుడు మ‌హేశ్ కు ఎదురైంది.

తాజాగా ఆయన న‌టించిన మ‌హ‌ర్షి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్ర ప్రిరిలీజ్ ఫంక్ష‌న్లో మాట్లాడిన మ‌హేశ్.. తాను ప‌ని చేసిన ద‌ర్శ‌కుల గురించి ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా పూరీజ‌గ‌న్నాద్ .. సుకుమార్ పేరును ప్ర‌స్తావించ‌లేదు. దీంతో.. ప‌లువురు మ‌హేశ్ మాటల్ని త‌ప్పు ప‌డుతున్నారు. పోకిరి లాంటి సినిమాకు.. నేనొక్క‌డినే లాంటి క‌ల్ట్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పూరీ.. సుకుమార్ ల‌ను మ‌హేశ్ ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం ఏమిటి? అన్న వాద‌న అభిమానుల్లో ఏర్ప‌డింది.

దీనిపై తాజాగా ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. పూరీకి.. సుకుమార్ కు థ్యాంక్స్ చెప్ప‌క‌పోవ‌టం త‌న త‌ప్పేన‌ని అంగీక‌రించారు మ‌హేశ్‌. అయితే.. అంత‌కు ముందే యూర‌ప్ నుంచి 16 గంట‌లు ఫ్లైట్ లో ప్ర‌యాణం చేసి రావ‌టం.. తాను మాట్లాడుతున్న‌ప్పుడు అభిమానులు వేదిక మీద‌కు రావ‌టంతో తాను పేర్లు చెప్ప‌టంలో పొర‌పాటుకు గురైన‌ట్లు వివ‌ర‌ణ ఇచ్చారు. ఏదో రెండుపేర్లు చెప్ప‌ని దానికి మ‌హేశ్ ను అంత‌లా ఆడిపోసుకుంటున్నారు.. ఫ్టైల్ జ‌ర్నీ చేయ‌టం వ‌ల్ల మిస్ అయ్యిందంటున్నారుగా.. వ‌దిలేద్దూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English