దటీజ్ మెగాస్టార్

దటీజ్ మెగాస్టార్

కొంచెం స్టార్ డమ్ సంపాదించిన వాళ్లు కూడా తమ గురించి తాము చాలా ఊహించుకుంటూ ఉంటారు. అదుపు తప్పి ప్రవర్తిస్తుంటారు. యాటిట్యూడ్ చూపిస్తుంటారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో ఇంకెవ్వరికీ సాధ్యం కాని శిఖరాల్ని అందుకున్నా కూడా చిరంజీవి ఎంత హుందాగా ప్రవర్తిస్తుంటాడో చూస్తూనే ఉన్నాం. చిరును టార్గెట్ చేస్తూ ఎందరో విమర్శలు చేశారు కానీ.. ఎప్పుడూ కూడా ఆయన అదుపు తప్పి మాట్లాడింది లేదు. ఎవరి గురించి నోరు జారింది లేదు.

తనను విమర్శించిన వాళ్లతో కూడా చాలా మర్యాదగా, స్నేహంగా ప్రవర్తించాడు చిరు. దాసరి నారాయణరావు, మోహన్ బాబు లాంటి వాళ్లు చిరును టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. కానీ ఎప్పుడూ కూడా చిరు వాళ్లను పల్లెత్తు మాట అన్నది లేదు. తనను విమర్శించినా కూడా దాసరి పట్ల అపారమైన గౌరవ మర్యాదలు ప్రదర్శించేవాడు. చిరు తీరు చూసి దాసరి కూడా ఒక దశలో ఫిదా అయిపోయాడు. చిరును విమర్శించడం మానుకున్నాడు.

ఇక దాసరి మరణానంతరం చిరు ఆయన పట్ల మరింత గౌరవ భావంతో ఉన్నాడు. పసుపులేటి రామారావు అనే జర్నలిస్టు దాసరి మీద పుస్తకం తీసుకొస్తానంటే.. చిరు చొరవ తీసుకుని దాని ఖర్చునంతా భరించాడు. పెద్ద ఈవెంట్ చేసి ఘనంగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశాడు. శనివారం దాసరి జయంతి కాగా.. దర్శకుల సంఘం ఈ రోజును డైరెక్టర్స్ డేగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు చిరు ముఖ్య అతిథిగా వచ్చి సంఘానికి రూ.25 లక్షల విరాళం కూడా అందజేశాడు.

దాసరికి అనుంగు శిష్యులుగా చెప్పుకున్న వాళ్లు, ఆయన బతికుండగా ప్రాపకం కోసం ప్రయత్నించిన వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. కానీ దాసరి ఒక దశలో వ్యతిరేకించి, విమర్శలు చేసిన చిరు మాత్రం దాసరి  మీద అపారమైన గౌరవ మర్యాదలు ప్రదర్శించడం గమనార్హం. కేవలం సినిమాలు హిట్టయితే చిరు మెగాస్టార్ అయిపోలేదు. వ్యక్తిత్వం కూడా తోడైతేనే చిరు ఆ స్థాయికి చేరాడనానికి ఈ ఉదంతం తాజా ఉదాహరణ.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English