‘మహర్షి’ దుమ్ము దులుపుతున్నాడు

‘మహర్షి’ దుమ్ము దులుపుతున్నాడు

కొన్ని రోజుల ముందు వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘మహర్షి’ చుట్టూ ఒక రకమైన నెగెటివిటీ కనిపించింది. వరుసగా ఈ సినిమా గురించి నెగెటివ్ వార్తలు వచ్చాయి. ఆడియో అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, వేరే ప్రోమోలు కూడా అంతంతమాత్రంగా ఉండటం, మహేష్ లుక్స్ రొటీన్‌గా అనిపించడం సినిమాపై నెగెటివిటీని పెంచాయి. దీనికి తోడు బిజినెస్ విషయంలో నిర్మాతల మధ్య గొడవ కూడా సినిమాపై నెగెటివిటీని పెంచింది.

ఈ పరిస్థితుల్లో ‘మహర్షి’పై భారీ పెట్టుబడి పెడుతున్న బయ్యర్ల పరిస్థితి ఏమిటో అన్న ఆందోళన కనిపించింది. కానీ ఇటీవలి ప్రి రిలీజ్ ఈవెంట్ దగ్గర్నుంచి పరిస్థితి మారిపోయింది. ‘మహర్షి’ ట్రైలర్ ఆకట్టుకోవడం.. సినిమా గురించి దిల్ రాజు సహా ఓ రేంజిలో చెప్పడంతో అంచనాలు మారాయి. సినిమాపై పాజిటివిటీ కనిపించింది.

మామూలుగా మహేష్ సినిమాపై ముందు ఎలాంటి అంచనాలు ఉన్నప్పటికీ.. రిలీజ్ దగ్గర పడేసరికి మంచి హైప్ వస్తుంది. ప్రేక్షకుల్లో ఒక యుఫీరియా కనిపిస్తుంది. ‘మహర్షి’ విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. పెట్టిన టికెట్లు పెట్టినట్లే అయిపోతున్నాయి. సినిమాకు ఓపెనింగ్స్ విషయంలో ఏమాత్రం ఢోకా లేనట్లే కనిపిస్తోంది. సంక్రాంతికి వచ్చిన భారీ చిత్రాలు దారుణ ఫలితాలందుకున్నాయి. ఆ తర్వాత పెద్ద సినిమాల సందడే లేదు.

ఈ ఏడాదికి మళ్లీ ‘సాహో’ వచ్చే వరకు మరో భారీ చిత్రం లేదు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు కూడా ‘మహర్షి’ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మాస్, క్లాస్అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ థియేటర్లకు రప్పించే.. .. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ అన్న భేదం లేకుండా అన్నింటినీ ఫుల్ చేయించే సూపర్ స్టార్లలో మహేష్ ఒకడు. అతడి స్టామినా ఏంటన్నది ‘మహర్షి’ మరోసారి రుజువు చేస్తోంది. మిడ్ సమ్మర్లో వస్తున్న సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. వసూళ్ల మోత మోగడం ఖాయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English