‘ఆర్ఎక్స్’ డైరెక్టర్ అంత మాట అన్నాక కూడా..

‘ఆర్ఎక్స్’ డైరెక్టర్ అంత మాట అన్నాక కూడా..

గత ఏడాది సెన్సేషనల్ హిట్టయిన ‘ఆర్ఎక్స్ 100’ వచ్చి పది నెలలు కావస్తోంది. ఆ సినిమా రిలీజైన కొన్ని రోజులకే దాని దర్శకుడు అజయ్ భూపతికి అవకాశాలు వెల్లువెత్తినట్లు వార్తలొచ్చాయి. స్టార్ హీరోలు, పెద్ద నిర్మాతలు అతడితో పని చేయడానికి ఆసక్తి ప్రదర్శించినట్లు గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పటిదాకా అజయ్ తన కొత్త సినిమా మొదలుపెట్టలేదు.

నితిన్ అని.. బెల్లంకొండ శ్రీనివాస్ అని.. నాగచైతన్య అని.. ఇలా అజయ్ రెండో సినిమా హీరోగా రకరకాల పేర్లు వినిపించాయి. కానీ వీరిలో ఎవరూ ఖరారు కాలేదు. ఏ సినిమా మొదలు కాలేదు. తన తర్వాతి సినిమా గురించి రోజుకో వార్త వస్తుండటంతో ఈ మధ్య ఫ్రస్టేట్ అయిపోయాడు అజయ్. తన తర్వాతి సినిమా ఎవరితో, ఎప్పుడు తీయాలో తనకు తెలుసని.. రూమర్లు కట్టిపెట్టండని ఘాటుగానే చెప్పాడు అజయ్ భూపతి.

ఈ కామెంట్ చూసి తన గురువు రామ్ గోపాల్ వర్మకు అజయ్ ఏమాత్రం తక్కువ కాదని అనుకున్నారు జనాలు. ఐతే అజయ్ అంత సూటిగా ట్వీట్ చేసినా కూడా అతడి కొత్త సినిమా గురించి రూమర్లు ఆగట్లేదు. మొన్నటిదాకా నాగచైతన్య హీరోగా అజయ్ సినిమా కన్ఫమ్ అని వార్తలు రాగా.. ఇప్పుడు కొత్త కబురు వినిపిస్తోంది. ‘పెళ్ళిచూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరితో అజయ్ తన తర్వాతి చిత్రం చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు.

శివను హీరోగా పరిచయం చేస్తూ ఇప్పటికే ఒక సినిమా మొదలుపెట్టారు. అది దాదాపు పూర్తయింది కూడా. ఐతే లాంచింగ్‌కు క్రేజీ ప్రాజెక్టు సెట్ చేయలేకపోయిన రాజ్.. రెండో సినిమాకు అజయ్‌ను ఎంచుకుని క్రేజ్ తీసుకురావాలని చూస్తున్నాడట. తాను అనుకున్న హీరోలెవరితోనూ ప్రాజెక్టు సెట్ కాకపోవడంతో అజయ్ ఈ చిత్రం చేయడానికి ఓకే అన్నట్లు చెబుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English