మహేష్-రాజమౌళి సినిమా.. ఎప్పట్లాగే!

మహేష్-రాజమౌళి సినిమా.. ఎప్పట్లాగే!

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏస్ డైరెక్టర్ రాజమౌళిల కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ కాంబోలో సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చ కూడా నడుస్తోంది. రాజమౌళితో తన సినిమా ఉంటుందని మహేష్ బాబు.. మహేష్‌తో సినిమా చేస్తానని రాజమౌళి వేర్వేరు సందర్భాల్లో వెల్లడించారు. కానీ ఇప్పటిదాకా అది కార్యరూపం దాల్చలేదు. మహేష్ తన కొత్త సినిమా ప్రమోషన్లకు వచ్చినపుడల్లా దీని గురించి చర్చ ఉంటుంది. జక్కన్నతో సినిమా చేస్తానని అంటాడు. ‘మహర్షి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసి మహేష్ మరోసారి అదే మాట చెప్పాడు. కాకపోతే ఈసారి కొంచెం బలంగానే ఆ విషయం చెప్పాడు.

తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మహేష్ వెల్లడిస్తూ త్వరలోనే అనిల్ రావిపూడి సినిమాను మొదలుపెట్టబోతున్నానని.. ఆ తర్వాత రాజమౌళి సినిమా ఉండే అవకాశం ఉందని వెల్లడించాడు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబందించి చర్చలు జరుగుతున్నాయని.. అన్ని కుదిరితే త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారకంగా ప్రకటన వెలువడుతుందని కూడా మహేష్ చెప్పడం విశేషం. ఐతే అనిల్ సినిమాను మహేష్ ఈ ఏడాది చివర్లోపే పూర్తి చేసే అవకాశముంది. రాజమౌళి మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ నుంచి బయటికి రావడానికి ఏడాది పైగానే సమయం పడుతుంది. తర్వాత మహేష్ కోసం స్క్రిప్టు రెడీ చేయడానికి కూడా కొన్ని నెలలు వెచ్చించాలి. ఆ రకంగా చూసుకుంటే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జక్కన్న మహేష్ సినిమానే చేయాలనుకున్నప్పటికీ.. కనీసం ఇంకో ఏడాదిన్నర ఆగాల్సిందే. అన్నీ కుదిరితే 2021లో ఈ చిత్రం పట్టాలెక్కొచ్చేమో. సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణతో రాజమౌళికి కమిట్మెంట్ ఉన్న నేపథ్యంలో ఆయన బేనర్లోనే ఈ చిత్రం చేసే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English