చుట్టివేత కార్యక్రమం కట్టిపెట్టిన జగన్‌

చుట్టివేత కార్యక్రమం కట్టిపెట్టిన జగన్‌

ఎంత పెద్ద స్టార్‌తో తీసినా, ఎన్ని కోట్ల బిజినెస్‌ జరుగుతోన్న సినిమాని అయినా నాలుగైదు నెలల్లో చుట్టేసి అవతల వేసేయడం పూరి జగన్నాథ్‌ స్పెషాలిటీ. మరో టేక్‌ చేద్దామని హీరోలే అడిగినా కానీ వద్దనేస్తుంటాడు పూరి. ఏదైనా సినిమా మొదలు పెట్టినపుడే దాని విడుదల తేదీ కూడా చెప్పేసి, వీలయితే ఒక నాలుగు వారాల ముందే విడుదల చేసేయడానికి కూడా రెడీగా వుంటాడు. అలాంటి పూరి తన తాజా చిత్రం ఇస్మార్ట్‌ శంకర్‌కి మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నాడు. చుట్టివేసే తన స్టయిల్‌ పక్కన పెట్టి ప్రతి సీన్‌ జాగ్రత్తగా తీస్తున్నాడు. అవసరమైతే సెట్లో బెటర్‌మెంట్స్‌కి, లేదా సీన్‌ ఇంప్రూవ్‌మెంట్స్‌కి కూడా ప్రయత్నిస్తున్నాడు.

ఒకటికి రెండు టేకులు షూట్‌ చేస్తూ బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇవ్వడానికి చూస్తున్నాడు. ఇది తనకి డూ ఆర్‌ డై అనేది పూరికి బాగా తెలుసు. ఈ చిత్రం కనుక మిస్‌ఫైర్‌ అయితే ఇక పూరికి పేరున్న హీరోల డేట్స్‌ కూడా దొరక్కపోవచ్చు. స్వీయ నిర్మాణం కావడంతో పూరి అసలు ఛాన్స్‌ తీసుకోకుండా కాస్త సమయం పట్టినా కానీ 'ఇస్మార్ట్‌ శంకర్‌'ని పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు. మే నెలలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు జూన్‌ లేదా జులైలో విడుదల కావచ్చునని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English