పవన్‌కళ్యాణ్‌ని తగ్గించే ప్రయత్నం

పవన్‌కళ్యాణ్‌ని తగ్గించే ప్రయత్నం

ఎన్నికలైపోయిన తర్వాత మీడియాలో ఎక్కడా కనబడని పవన్‌కళ్యాణ్‌ గురించి వ్యతిరేక మీడియా ఇష్టానికి ప్రచారం చేసుకుంటోంది. తటస్థులు, విజ్ఞులు అయిన కొందరు జర్నలిస్టులు... భగవద్గీత సారాన్ని పవన్‌కళ్యాణ్‌ నమ్ముతాడని, ప్రయత్నం మాత్రం చేసి ఫలితం దేవుడికి వదిలేసాడని మెచ్చుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు ఏమిటనేది ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాక నాదే గెలుపు అంటూ తొడలు కొట్టాల్సిన పని లేదని, ఈ విషయంలో పవన్‌ మిగిలిన సీనియర్ల కంటే పరిణితి చూపిస్తున్నాడని ప్రశంసిస్తున్నారు.

అయితే వ్యతిరేక మీడియా మాత్రం పవన్‌ అప్పుడే చాప చుట్టేసాడని, మళ్లీ సినిమాలు చేసుకోవడానికి ప్లాన్స్‌ వేసుకుంటున్నాడని, పలువురు దర్శకులతో చర్చిస్తున్నాడని, తక్కువ బడ్జెట్‌లో మూడు, నాలుగు సినిమాలు చేయడానికి తలపెట్టాడని తోచింది రాసేస్తోంది. గబ్బర్‌సింగ్‌ దర్శకుడు హరీష్‌ శంకర్‌ని కలిసాడంటూ ఇలాగే పవన్‌ గురించి ఒక పుకారు పుట్టించింది. అయితే అందులో నిజం లేదని, తానసలు పవన్‌ని కలవనే లేదని హరీష్‌ శంకర్‌ వెంటనే దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాడనుకోండి. డాలీ, త్రివిక్రమ్‌లాంటి సన్నిహిత దర్శకులతో పవన్‌ సినిమాలు ప్లాన్‌ చేస్తున్నాడంటూ ఒక వైపు అరణ్య రోదన వినిపిస్తూనే వుంది. మరి ఎన్నికల ఫలితాలు మరో ఇరవై రోజుల్లోగా వచ్చేస్తాయనే దశలో పవన్‌ని ఇలా తగ్గించి చూపించి వారు బావుకునేది ఏమిటో వారికే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English