మహేష్‌ ఫాన్స్‌ సీరియస్‌.. విజయ్‌ మాత్రం బిందాస్‌

మహేష్‌ ఫాన్స్‌ సీరియస్‌.. విజయ్‌ మాత్రం బిందాస్‌

మహర్షి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ మాట్లాడిన మాటలు మహేష్‌ అభిమానులని నొప్పించాయి. మహేష్‌కి వీరాభిమాని అయిన తాను ఇప్పుడు మహేష్‌ని 'సర్‌' అనాలా అని విజయ్‌ దేవరకొండ అన్నాడు. నిజానికి అతని ఎమోషన్‌తో ఏ ఫాన్‌ అయినా కనక్ట్‌ అవ్వాలి. సాధారణంగా సినిమా హీరోలని బయటి జనం ఏకవచనంతోనే సంబోధిస్తారు. ఇంకా చెప్పాలంటే 'వాడు, వీడు' అంటూనే మాట్లాడతారు. అయితే అదే స్టార్‌ ఎదురుపడినపుడు, మాట్లాడాల్సి వచ్చినపుడు 'సర్‌' అనాల్సి వస్తే కాస్త తడబడతారు. విజయ్‌ దేవరకొండ అదే ఉద్దేశంతో అలా మాట్లాడాడు. తన తీరు సగటు హీరోలా కాకుండా సగటు కుర్రాడిలా వుంటుంది కాబట్టే విజయ్‌కి అంత క్రేజ్‌ వచ్చింది.

స్టేజ్‌ మీద తెచ్చిపెట్టుకున్న మాటలు అతనెప్పుడూ మాట్లాడడు. అది మహేష్‌ కూడా అర్థం చేసుకున్నాడనేది అతని స్పీచ్‌కి మహేష్‌ రియాక్షన్‌లోనే అర్థమయింది. అయితే ఫాన్స్‌ మాత్రం విజయ్‌కి హెడ్‌ వెయిట్‌ అంటూ గోల మొదలు పెట్టారు. అల్లరి నరేష్‌ని కూడా సర్‌ అని సంబోధించిన మహేష్‌ని గౌరవించడానికి ఏమిటంటూ మీడియా కూడా విజయ్‌కి క్లాస్‌లు పీకేస్తోంది. అయితే విజయ్‌ దేవరకొండ మాత్రం ఇవన్నీ బిందాస్‌గా తీసుకుంటూ తన స్టయిల్‌ అదేనని, తర్వాత్తర్వాత అందరూ అలవాటు పడతారని, వేరొకరి మెప్పు కోసం తన తీరు మార్చుకోవాల్సిన పని లేదని తేల్చేస్తున్నాడు. పెద్ద స్టార్‌ పక్కన నిలబడగానే సహజత్వాన్ని విడిచి పెడితే అర్జున్‌ రెడ్డికీ ఇతరులకీ తేడా ఉండదు కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English