త్రివిక్రమ్ 2 వేల కోట్ల సినిమా!

త్రివిక్రమ్ 2 వేల కోట్ల సినిమా!

ఒకప్పుడు వంద కోట్ల సినిమా అంటే నోరెళ్లబెట్టి చూసేవాళ్లం. కానీ ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్లలో అలవోకగా సినిమాలు తీసేస్తున్నారు. గత ఏడాది వచ్చిన ‘2.0’ బడ్జెట్ రూ.575 కోట్లన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తీస్తున్నాడు. రూ.500 కోట్లతో ‘రామాయణం’, రూ.1000 కోట్లతో ‘మహాభారతం’ సినిమాలు అనౌన్స్ చేశారు కానీ.. అవి కార్యరూపం దాల్చలేదు.

ఐతే ఇప్పుడు త్రివిక్రమ్ లాంటి దర్శకుడు రూ.2 వేల కోట్ల బడ్జెట్లో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి? ఐతే రెగ్యులర్ సినిమాలు తీసే త్రివిక్రమ్ అంత బడ్జెట్లో సినిమా చేయడమేంటి అని ఆశ్చర్యం కలుగుతోంది కదా? కానీ త్రివిక్రమ్ ఆప్త మిత్రుడు సునీల్ మాత్రం త్రివిక్రమ్‌కు ఆ బడ్జెట్ ఇస్తే అదిరిపోయే సినిమా తీస్తాడని అంటున్నాడు.

చాలా ఏళ్ల కిందట త్రివిక్రమ్ సునీల్‌కు ఒక భారీ కథ చెప్పాడట. అప్పటికి దాని బడ్జెట్ రూ.500 కోట్లు అవుతుందని అంచనా వేశాడట త్రివిక్రమ్. ఆ సినిమానే ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో తీస్తే బడ్జెట్ రూ.2 వేల కోట్లు అవుతుందని.. కానీ అది అద్భుతమైన కథ అని.. త్రివిక్రమ్ దాన్ని అంతే అద్భుతంగా తీయగలడని.. ఆ సినిమా రిలీజైతే ఖర్చుకు మించి భారీగా వసూళ్లు రాబడుతుందని అన్నాడు సునీల్. మరి త్రివిక్రమ్ ఈ కథను సునీల్‌కు మాత్రమే చెప్పాడా.. లేక ఎవరైనా నిర్మాతలకు కూడా ఈ కథ చెప్పాడా అన్నది తెలియడం లేదు.

చాలా ఏళ్ల కిందట రూ.500 కోట్ల బడ్జెట్ అంటే నిర్మాతలు గుండెలు ఆగిపోయేవే. కాబట్టే త్రివిక్రమ్ తన మిత్రుడికి తప్ప ఇంకెవరికీ ఈ స్టోరీ చెప్పి ఉండకపోవచ్చేమో. మరి భవిష్యత్తులో అయినా ఏ నిర్మాతనైనా ఒప్పించి ఈ భారీ కథను సినిమాగా తీస్తాడేమో త్రివిక్రమ్ చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English