హీరో కూతురిపై దారుణమైన ట్రోలింగ్‌

హీరో కూతురిపై దారుణమైన ట్రోలింగ్‌

ఇంటర్నెట్‌ జమానాలో ఎవరినైనా టార్గెట్‌ చేయడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు. కంగన రనౌత్‌లాంటి వాళ్లు  సినీ పరిశ్రమని పీడిస్తోన్న జాఢ్యమంటూ వారసులని టార్గెట్‌ చేస్తోంటే అది అదనుగా తీసుకుని కొత్తగా దిగుతోన్న వారసులపై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. కరణ్‌ జోహార్‌ సినిమా 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' చిత్రంతో పరిచయం అవుతోన్న చుంకీ పాండే కూతురు అనన్య పాండేని సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఒక పాట ఇటీవలే విడుదల కాగా, అనన్య ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్లే పలకడం లేదని, మనిషి అయి వుండీ ఎక్స్‌ప్రెషన్‌ పలకకుండా వుండడం కూడా ఒక టాలెంటేనని, ఆమెని మెచ్చుకోవాల్సిందేనంటూ గేలి చేస్తున్నారు.

అక్కడితో ఆగకుండా ఆమెని బాడీ షేమింగ్‌ చేయడానికి కూడా తెగిస్తున్నారు. బక్క పలచగా వుండే అనన్య స్కెలిటన్‌లా వుందంటూ, ఆమె ఒంటిపై కేజీ కండ కూడా లేదని, ఆమెకి కాస్త మంచి ఆహారం ఇవ్వమంటూ కామెంట్లు చేస్తున్నారు. కొత్తగా తెర మీదకి వస్తూ తన గురించి జనాభిప్రాయం తెలుసుకోవాలని ఆరాట పడుతోన్న ఇరవయ్యేళ్ల అమ్మాయికి ఇలాంటి ట్రోలింగ్‌ మానసిక క్షోభ కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అయితే గ్లామర్‌ ఫీల్డులో ఇప్పుడు నెగ్గుకు రావాలంటే ఇలాంటి అవమానాలకి, ఛీత్కారాలకి తట్టుకోక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English