అల్లు అర్జున్‌ పెద్ద ప్లానే వేస్తున్నాడు

అల్లు అర్జున్‌ పెద్ద ప్లానే వేస్తున్నాడు

అల్లు అర్జున్‌ ఏడాది కాలంగా ఖాళీగా వున్నాడని ఫాన్స్‌ తెగ ఫీలయిపోతున్నారు. నా పేరు సూర్య తర్వాత చాలా టైమ్‌ తీసుకుంటోన్న అల్లు అర్జున్‌ ఇంకా తన తాజా చిత్రం మొదలు పెట్టనేలేదు. అయితే ఈ సంవత్సర కాలాన్ని అల్లు అర్జున్‌ వృధా చేయలేదు. తన కెరియర్‌ ప్లానింగ్‌పై దృష్టి పెట్టాడు. తనకంటూ స్పెషల్‌గా ఒక రైటర్స్‌ టీమ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. వీరు కథలు సిద్ధం చేయడంతో పాటు తన దగ్గరకు వచ్చిన కథలని జడ్జి చేసే పని కూడా వాళ్లకి అప్పగించాడు. అలాగే ఇతర వ్యాపారాల మీద కూడా అల్లు అర్జున్‌ దృష్టి పెట్టాడు.

దీంతో పాటు తన మార్కెట్‌ని విస్తరించుకునే ప్రణాళిక రచిస్తున్నాడు. తెలుగు సినిమాకి ఉత్తరాదిలో పెరుగుతోన్న ఆదరణ దృష్టిలో వుంచుకుని త్వరలో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్నాడు. అయితే దీనిపై అల్లు అర్జున్‌ ఇంకా సీరియస్‌ డెసిషన్‌ తీసుకోలేదు. తెలుగు దర్శకులతో చేయడం కంటే ఉత్తరాది దర్శకులని అప్రోచ్‌ కావాలని చూస్తున్నాడు. సరైనోడు, డిజె డబ్బింగ్‌ వెర్షన్స్‌ సక్సెస్‌ కూడా అల్లు అర్జున్‌కి హెల్ప్‌ అవుతోంది. ఆ సినిమాలతో అక్కడ ఆల్రెడీ పాపులర్‌ అయి వుండడంతో అల్లు అర్జున్‌ ఇంట్రడక్షన్‌ ఈజీ అయిపోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English