మహేష్‌ మరీ ఇంతగా పగబట్టాలా?

మహేష్‌ మరీ ఇంతగా పగబట్టాలా?

దర్శకులతో మహేష్‌కి చాలా మంచి రిలేషన్‌ వుంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి ఒక దర్శకుడిని నమ్మి ఫీల్డులో దిగితే ఇక బ్లయిండ్‌గా వెళ్లిపోతాడని అతని గురించి గొప్పగా చెబుతుంటారు. ఈ ప్రాసెస్‌లో మహేష్‌ చాలా ఎదురు దెబ్బలు కూడా తిన్నాడు. దర్శకులతో ఎంత మంచి రిలేషన్‌ మెయింటైన్‌ చేస్తాడో తేడా వస్తే వారితో అంతే డిస్టెన్స్‌ కూడా పాటిస్తుంటాడు. సుకుమార్‌ మీద ఇటీవల మహేష్‌కి కోపం బాగా వచ్చిన సంగతి విదితమే. ఇకపై అతనితో పని చేయను అన్నట్టుగానే మహేష్‌ తేల్చేసాడు. అలాగే 'పోకిరి', 'బిజినెస్‌మేన్‌' తర్వాత పూరి జగన్నాథ్‌తో కూడా ఒక విషయంలో పేచీ వచ్చింది.

దాంతో అతడిని ఇక కన్సిడర్‌ కూడా చేయడం లేదు. పూరిని మహేష్‌ ఎంతగా దూరం పెట్టాడంటే కనీసం తన పాతిక సినిమాల జర్నీ గుర్తు చేసుకునే టైమ్‌లో పోకిరి, బిజినెస్‌మేన్‌ చిత్రాలు గుర్తుకి కూడా రాలేదు. పూరిని మర్చిపోవడమేంటని మహేష్‌ని నెటిజన్లు బాగా ట్రోల్‌ చేస్తున్నారు కూడా. ప్రస్తుతం సీనియర్‌ దర్శకులు, పేరున్న వాళ్ల కంటే తమని తాము నిరూపించుకుని తదుపరి స్థాయికి వెళ్లాలని చూస్తోన్న యువకులకి అవకాశాలు ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని మహేష్‌ భావిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English