మహేష్‌తో గేమ్స్‌... బెంబేలెత్తిన వెబ్‌సైట్‌ జర్నలిస్ట్‌!

మహేష్‌తో గేమ్స్‌... బెంబేలెత్తిన వెబ్‌సైట్‌ జర్నలిస్ట్‌!

మహేష్‌ బాబు మీద ఈగ వాలనివ్వకుండా ఇప్పుడో పీఆర్‌ సైన్యమే వుందని చాలా మందికి తెలిసినట్టు లేదు. అందరు హీరోల మీద రాసినట్టుగా అతనిపై అవాకులు చవాకులు రాసేస్తే 'గాసిప్స్‌'గా అవి చెల్లిపోవు. ప్రతి నెలా లక్షలు ఖర్చు పెట్టి తన పీఆర్‌ టీమ్‌ని మహేష్‌ మెయింటైన్‌ చేస్తున్నాడు. అతనిపై దుష్ప్రచారం జరగకుండా చూసుకోవడమే ఈ టీమ్‌ ప్రథమ కర్తవ్యం. స్పైడర్‌ టైమ్‌లో ఇండియాలో మొదటి షో పడకుండానే ఒక హీరో టీమ్‌ చేసిన టార్గెట్‌ వల్ల మహేష్‌కి చాలా నష్టం జరగడంతో అతను ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపై అలాంటివి జరగకుండా చాలా జాగ్రత్తగా వుంటున్నాడు.

అయితే పూటకి పది ఆర్టికల్స్‌ పుట్టించి రాస్తే కానీ జీతాలు రాని ఫీల్డులో వున్న వెబ్‌ జర్నలిస్టులు రోజుకి లిస్ట్‌ వేసుకుని పులిహార వార్తలు రాస్తుంటారు. మహర్షి రిలీజ్‌ దగ్గరకి వచ్చింది కదా అని మహేష్‌ని టార్గెట్‌ చేసి అలాగే ఓ ప్రబుద్ధుడు చేతికొచ్చింది రాసేసాడు. అంతే... మహేష్‌ సైన్యం అలర్ట్‌ అయిపోయి సదరు వెబ్‌సైట్‌ని కాంటాక్ట్‌ చేసి తమరి సోర్స్‌ ఏమిటో చెబుతారా లేక తమపై యాక్షన్‌ తీసుకోమంటారా అనేసరికి అతగాడి పేరు చెప్పేసారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకని అనుకున్నారో ఏమో అతనిపై డైరెక్ట్‌ యాక్షన్‌ తీసుకోకుండా ఫాన్స్‌కి లీక్‌ అందించి వదిలేసారు. దాంతో ఫాన్స్‌ అతడిని టార్గెట్‌ చేస్తూ తమదైన శైలిలో విరుచుకుపడుతూ వుంటే కక్కలేక, మింగలేక బెంబేలెత్తిపోతున్నాడట సదరు జర్నలిస్ట్‌. ఈ దెబ్బకి మళ్లీ మహేష్‌ గురించి తాను ఆర్టికల్స్‌ రాసే యే వెబ్‌సైట్‌లో అయినా ఒక ఆర్టికల్‌ రాయాలంటే పెన్నులో వణుకు పుడుతుందేమో అని జోక్స్‌ వేసుకుంటున్నారు మీడియా సర్కిల్స్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English