విజయ్ దేవరకొండ తోపేనబ్బా

విజయ్ దేవరకొండ తోపేనబ్బా

ప్రస్తుతం టాలీవుడ్ కథానాయకుల్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ స్పీకర్ ఎవరు? ఈ విషయంలో సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదు. విజయ్ దేవరకొండ అని ఫిక్స్ చేసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి వక్తే కానీ.. అతడి స్పీచులన్నీ చాలా సీరియస్‌గా, ఎమోషనల్‌గా సాగుతుంటాయి. ప్రసంగాలు ఆసక్తి రేకెత్తిస్తాయి కానీ.. ఎంటర్టైన్మెంట్ తక్కువే ఉంటుంది. కానీ విజయ్ దేవరకొండ అలా కాదు. మైక్ అందుకున్నాడంటే చాలు.. ఇక చమక్కులే చమక్కులు. అలాగని అతను భాషతో విన్యాసాలు చేయడు. పంచ్ డైలాగులు వేయడు. ఏదో ప్రిపేర్ చేసుకుని వచ్చిన కథలు చెప్పడు. ఎదురుగా ఒక వ్యక్తితో క్యాజువల్‌గా మాట్లాడుతున్నట్లే ఉంటుంది అతడి ప్రసంగం. ఏం మాట్లాడినా నిజాయితీగా కూడా అనిపిస్తుంది. ఇప్పటికే చాలా వేడుకల్లో తన స్పీచులతో అదరగొట్టేశాడు విజయ్. తాజాగా ‘మహర్షి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో స్పీచ్‌తో మరోసారి విజయ్ జనాల మనసులు కొల్లగొట్టేశాడు.

విజయ్ స్పీచ్‌కు మహేష్ సహా వేదిక మీదున్నవాళ్లు, ఈవెంట్‌కు హాజరైన భారీ జనాలు, టీవీల్లో, ఇంటర్నెట్లో చూసిన వాళ్లు.. ఇలా అందరూ ఫిదా అయిపోయారంతే. మహేష్ బాబు మీద తన అభిమానాన్ని అతను ఎక్స్‌ప్రెస్ చేసిన తీరు అమోఘం. దిల్‌సుఖ్‌నగర్ కోణార్క్ థియేటర్ దగ్గర మురారి సినిమా టికెట్ల కోసం తాను పడ్డ కష్టాల నుంచి మొదలు పెట్టి.. ‘శ్రీమంతుడు’ సినిమాకు గాను అవార్డు అందుకోవడానికి ఒక ఈవెంట్‌కు మహేష్ వచ్చినపుడు వెనుక వరుసల్లో కూర్చున్న తనకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో చెప్పడం కావచ్చు.. తన సినిమా ‘పెళ్లిచూపులు’ గురించి మహేష్ ట్వీట్ వేసినపుడు తాను ఎగ్జైట్ అయిన విధానం గురించి కావచ్చు.. విజయ్ చాలా నిజాయితీగా తన పీలింగ్స్‌ను బయటపెట్టిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక తాను అభిమానించే హీరోను ఎప్పుడూ మహేష్ బాబు అని.. మనోడు అని పిలుచుకునే తాను.. ఈ రోజు వచ్చి ‘మహేష్ సార్’ అనడం అంటే తనకు ఇబ్బందిగా ఉందని, ఫ్లోలో సార్ లేకుండా మహేష్ బాబు అని సంబోధించేస్తానేమో అని విజయ్ అనడం అతడి మార్కు చమక్కే. మొత్తంగా ఈ వేడుకలో మిగతా స్పీచులన్నీ ఒకెత్తయితే.. విజయ్ ప్రసంగం మరో ఎత్తని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English